Saturday, July 25, 2026
E-PAPER
Homeజిల్లాలుసిద్దిపేటలో ఖైదీ పరార్ 

సిద్దిపేటలో ఖైదీ పరార్ 

- Advertisement -

నవతెలంగాణ –  సిద్దిపేట 
ఖైదీ పరారైన సంఘటన సిద్దిపేట పట్టణంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సిద్దిపేట జిల్లా జైలులో శిక్ష అనుభవిస్తున్న ఏడుగురు ఖైదీలను శనివారం సాధారణ వైద్య పరీక్షల నిమిత్తం పోలీసులు జిల్లా ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఈ క్రమంలో పోలీస్ వాన్ ఎమర్జెన్సీ డోర్ నుంచి పోలీసుల కండ్లు కప్పి సాయి కుమార్ అనే ఖైదీ పరారైనట్లు తెలిసింది. ఖైదీ సాయికమార్ బైకు దొంగతనం కేసుల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. పరారైన ఖైదీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -