ఆలూర్ సొసైటీలో క్రాప్ లోన్లు పంపిణీ చేసిన చైర్మన్

నవతెలంగాణ-ఆర్మూర్ : మండలంలోని ఆలూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అద్వర్యంలో సోమవారం నూతనంగా ఎస్ఏఓ క్రాపు లోన్స్  సంఘం  చైర్మన్ తంబుర్ శ్రీనివాస్ చేతుల మీదుగా పంపిణి చేయటం జరిగినది. 18 మంది రైతులకు రూపాయలు 19,44,000 పంపిణి  చేయటం జరిగినది.ఇట్టి కార్యక్రమానికి సంఘం వైస్ చైర్మన్ చేపూర్ రాజేశ్వర్ డైరెక్టర్లు కళ్ళెం భోజ రెడ్డి ,బార్ల సంతోష్ రెడ్డి,కళ్ళెం సాయ రెడ్డి ,సింగేడి మల్లు బాయి ,ఇంగు గోవర్దన్,అరే రాజేశ్వర్,దుదిగం ప్రమోద్ కుమార్,   కట్ట నర్సయ్య,పచ్చుక లసుం బాయి,వెల్మ నర్స రెడ్డి ,,గొల్ల గంగాధర్, సంఘం కార్యదర్శి తొర్తి మల్లేష్,సిబ్బంది డి.ముత్యం,దేవరాజ్,గంగాధర్, గంగారాం,రాజు రైతులు  పాల్గొన్నారు.
Spread the love