Wednesday, July 29, 2026
E-PAPER
Homeతాజా వార్తలుమరో కల్ట్ లవ్ స్టోరీ 'చెన్నై లవ్ స్టోరీ'

మరో కల్ట్ లవ్ స్టోరీ ‘చెన్నై లవ్ స్టోరీ’

- Advertisement -

‘నాకు పర్సనల్ గా లవ్ స్టోరీస్ అంటే చాలా ఇష్టం. ఈ చెన్నై లవ్ స్టోరీతో మరో కల్ట్ లవ్ స్టోరీ ఇండస్ట్రీకి ఇచ్చారు. మనం ఎన్నో విభిన్నమైన ప్రేమ కథలు చూశాం. పెళ్లయ్యాక, లవ్ బ్రేకప్ అయ్యాక వాళ్ల కథలు ఎలా ఉంటాయి అనే సంక్లిష్టమైన బ్యాక్ డ్రాప్ లు కూడా వస్తున్నాయి. ఈ తరం ప్రేక్షకులు అలాంటి ప్రేమ కథలకే ఎక్కువ కనెక్ట్ అవుతున్నారు. ఈ సినిమా చూశాక ఎంతో సంతోషించాను. పరిణితితో రాసిన ప్రేమ కథ ఇది. వీళ్ల విజయం నాకెంతో స్ఫూర్తినిస్తోంది. వచ్చే వీకెండ్ కూడా కలెక్షన్స్ చాలా బాగుంటాయి’ అని హీరో నాగచైతన్య చెప్పారు కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ జంటగా నటించిన ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణతో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రశంసలతో పాటు మంచి వసూళ్లు దక్కించుకుంటోంది. ఈ సినిమా 3 రోజుల్లోనే 40.1 కోట్ల రూపాయలు ఆర్జించింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా గ్రాండ్ సక్సెస్ మీట్ ను హీరో నాగచైతన్య ముఖ్య అతిథిగా నిర్వహించారు. హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ, ‘అన్ని ఏజ్ గ్రూప్స్ ప్రేక్షకులు థియేటర్స్ కు వెళ్లి సినిమా చూస్తున్నారు. మీ అందరినీ థియేటర్స్ లో చూస్తుంటే చెప్పలేనంత సంతోషంగా ఉంది. మీరంతా మూవీకి కనెక్ట్ అవుతున్నారు. ఎమోషనల్ అవుతున్నారు. మా క్యారెక్టర్స్ కు రిలేట్ అవుతున్నారు’ అని తెలిపారు. హీరోయిన్ శ్రీ గౌరి ప్రియ మాట్లాడుతూ,’ఏడాదిన్నరగా ఈ సినిమా మాకు ఎన్నో ఎమోషన్స్ ను పంచుతోంది. నివిగా నేను పర్ ఫార్మ్ చేయగలను అని రాజేశ్‌ నమ్మారు. ఇలాంటి డెప్త్ ఉన్న క్యారెక్టర్ నా కెరీర్ బిగినింగ్ లోనే దక్కడం సంతోషంగా ఉంది.

నాకు నిజమైన కెరీర్ ఇచ్చిన చిత్రమిది. సినిమా రిలీజ్ అయ్యాక ప్రేక్షకులు చూపిస్తున్న ఇంత ప్రేమను ఊహించలేకపోయాం’ అని తెలిపారు.’తెలుగు తెరపై ఇలాంటి ప్రేమ కథ రాలేదు. మీరు సినిమా చూసి గుండెల్లో ఆ ఫీల్ నింపుకుంటారు అని చెప్పాను. నేను చెప్పినట్లే మీ ప్రశంసలు దక్కుతుంటే సంతోషంగా ఉంది’ అని కో ప్రొడ్యూసర్ ధీరజ్ మొగిలినేని చెప్పారు. డైరెక్టర్ రవి నంబూరి మాట్లాడుతూ,’ఈ సినిమా విజయానికి నా టీమ్ అందరికీ కృతజ్ఞతలు చెబుతున్నా. నా భార్య స్వప్న ఎంతో సపోర్ట్ చేసింది. గత ఏడాదిన్నరగా ఫ్యామిలీని చూసుకుంది. ఆమె లేకుంటే నేను ఈ వేదిక మీద ఉండేవాడిని కాదు’ అని అన్నారు. ప్రొడ్యూసర్, స్టోరీ రైటర్ సాయి రాజేష్ మాట్లాడుతూ,’ఎర్లీ టాక్ తో ఒక్కడినే గదిలో ఉండిపోయి బాధపడ్డాను. మా వాళ్లంతా సింగిల్ స్క్రీన్స్ కు వచ్చి చూడు రెస్పాన్స్ చాలా బాగుంది అన్నారు. మండే కలెక్షన్స్ చూసి గానీ నేను సినిమా సూపర్ హిట్ అని నిర్థారించుకోను అన్నాను. అలా నిన్న కలెక్షన్స్ చూశాక సంతోషంగా చెబుతున్నా. మా సినిమాను ప్రేక్షకులు ప్రేమిస్తున్నారు’ అని తెలిపారు. ‘నాలుగు రోజుల్లోనే ఆంధ్ర, నైజాం, సీడెడ్ అన్ని ఏరియాల్లో మా సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యింది. బ్లాక్ బస్టర్ కా దు అంతకుమించిన సక్సెస్ సాధించింది’ అని ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్ చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -