Monday, September 7, 2026
E-PAPER
Homeసినిమాథియేటర్‌లో చూడాల్సిన సినిమా

థియేటర్‌లో చూడాల్సిన సినిమా

- Advertisement -


సుమంత్, ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రల్లో నటించిన స్పిరిచువల్ మిస్టరీ థ్రిల్లర్ ‘మహేంద్రగిరి వారాహి’. హీరో సిద్దు జొన్నలగడ్డ ప్రత్యేక పాత్రలో కనిపిస్తున్నారు. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహించారు.
రాజశ్యామల ఎంటర్‌టైన్‌మెంట్స్, బ్రిడ్జ్ ఫిలిమ్స్ బ్యానర్లపై కలిపు మధు, లక్ష్మణ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం ఈనెల 11న ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన హీరో అఖిల్ అక్కినేని మాట్లాడుతూ, ‘ఇలాంటి మంచి ప్రాజెక్ట్ నిర్మించిన లక్ష్మణ్ కి కంగ్రాచ్యులేషన్స్. ఈ రోజుల్లో ప్రేక్షకులు థియేటర్‌కు రావాలంటే అలాంటి కంటెంట్‌ను అందించగలగాలి. ఇప్పుడు టీజర్, ట్రైలర్ చూస్తుంటే ఖచ్చితంగా ఇది ప్రేక్షకులు థియేటర్‌లో చూడదగ్గ సినిమా అనిపిస్తుంది. నేను చిన్నప్పటి నుంచి సుమంత్ అన్న ఒడిలోనే పెరిగాను. నాకు ఏది కావాలన్నా ఎక్కువగా సుమంత్‌నే అడిగేవాడిని. ఈరోజు ఆయన ఫంక్షన్‌కు వచ్చి మాట్లాడుతుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. సిద్దుకి థాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఆయన సినిమాలు పెద్ద విజయాలు సాధిస్తున్నాయి. కానీ ఆయన వేరే సినిమా కోసం సపోర్ట్ చేస్తూ ఇందులో చేయడం నిజంగా అభినందనీయం. డైరెక్టర్ సంతోష్ ఈ సినిమా కోసం తన ప్రాణం పెట్టి పని చేశారు. ‘మహేంద్రగిరి వారాహి’లాంటి కంటెంట్ ఉన్న సినిమా తీసుకొస్తున్నారు. ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వబోతుందని నమ్మకం ఉంది’ అని అన్నారు.
‘ఈ సినిమాలో నేను చేయడానికి ప్రధాన కారణం నిర్మాత మధు. సుమంత్ చాలా ప్రతి సినిమా డిఫరెంట్‌గా ఉంటుంది. ఇదొక అద్భుతమైన సినిమా. మేం ఇద్దరం కలిసి చేసిన సీన్ చాలా బావుంటుంది. తనతో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా అనిపించింది. దర్శకుడు అద్భుతంగా ఈ సినిమాను తీశాడు. టీజర్, ట్రైలర్, సాంగ్స్ చాలా బాగున్నాయి. అనుప్ రూబెన్స్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు’ అని హీరో సిద్దు జొన్నలగడ్డ చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -