ప్రమాదవశాత్తు పేలిన సాల్వెంట్ డ్రమ్

– అర్ధరాత్రి కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు
– ఇద్దరికి తీవ్ర కూలీలకు గాయాలు
– పరిస్థితి విషమం హైదరాబాద్ తరలింపు
నవతెలంగాణ-భిక్కనూర్: ప్రమాదవశాత్తు కెమికల్ ఫ్యాక్టరీలో సాల్వెంట్ డ్రమ్ పేలడంతో ఇద్దరు కార్మికులకు తీవ్ర గాయాలైన ఘటన మండలంలోని జంగంపల్లి గ్రామ శివారులో ఉన్న విజయసాయి కెమికల్ ల్యాబ్ లో అర్ధరాత్రి చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి మంగళవారం అర్ధరాత్రి విజయసాయి కెమికల్ ల్యాబ్ లో సాల్వెంట్ డ్రమ్ కెమికల్ ప్రమాదవశాత్తు ఒక్కసారిగా పేలింది, దీంతో ఇద్దరు కార్మికులు ఉత్తర ప్రదేశ్ ప్రాంతానికి చెందిన జగదీష్, పశ్చిమ బెంగాల్ కు చెందిన బబ్లుకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన కంపెనీ యాజమాన్యం చికిత్స నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆసుపత్రి తరలించగా పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్ తరలించారు.

Spread the love