- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: జిల్లాల పర్యటనకు సీఎం రేవంత్ సిద్ధమయ్యారు. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసింది. మొత్తం ఆరు రోజుల పాటు సీఎం జిల్లాల టూర్ కొనసాగనుంది. ఆరు రోజులు ఆరు జిల్లాల్లో సీఎం రేవంత్ పర్యటించనున్నారు. వచ్చే నెల డిసెంబర్ 9తో కాంగ్రెస్ అధికారం చేపట్టి రెండేళ్లు పూర్తి అవుతుంది. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన హామీలు, రాష్ట్ర అభివృద్ధి గురించి ప్రజలకు వివరించనున్నారు.
సీఎం రేవంత్ పర్యటన షెడ్యూల్ ఇదే..
డిసెంబర్ 1న మహబూబ్ నగర్ జిల్లా మక్తల్
డిసెంబర్ 2న ఖమ్మం జిల్లా కొత్తగూడెం
డిసెంబర్ 3న కరీంనగర్ జిల్లా హుస్నాబాద్
డిసెంబర్ 4న ఆదిలాబాద్
డిసెంబర్ 5న నర్సంపేట
డిసెంబర్ 6న నల్గొండ జిల్లా దేవరకొండ
- Advertisement -



