కళ్ళకు కనిపించేవన్నీ నిజం కాదని
కళ్ళగంతలు విప్పుతూ విస్తు పోయే వాస్తవాలు
గుట్టు రట్టు చేస్తున్నాయి.
భ్రమలన్నీ మేఘాల్లా చల్లగా జారుకుంటూ వీడిపోతున్నాయి.
తన రంగు, రూపు, గుణాల గురించి
శతాబ్దాలుగా మనలో ముద్రించుకున్న
ఊహ చిత్రాన్ని ఛిద్రం చేస్తూ సరికొత్త నిర్వచనానికి
పునాదులు తవ్వుతున్నాయి.
చంద్రుని దక్షిణ దృవం పై మొట్టమొదటిసారిగా అడుగుపెట్టి
అక్కడ ఖనిజాలతో పాటు నీటి జాడలను గుర్తించి,
అందులో దాగున్న డార్క్సైట్ నిజాలు
ఒక్కొక్కటిగా వెలుగులోకి తెస్తూ విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్లు
సమైక్య కృషిని చేస్తున్నాయి.
స్పేస్ సైన్స్ విభాగంలో నూతన అధ్యయనానికి దారితీసిన
ఇస్రో వారి చంద్రయాన్ 3 ప్రపంచ దేశాల దృష్టిని
తన వైపు మరిచేలా చేయటమేకాక
ఓటమిని గెలుపు బాటగా ఎలా మలచుకోవాలో
చేతల్లో చేసి చూపించింది.
ప్రస్తుతం స్లీప్ మోడ్లో ఉండి తిరిగి కార్యరూపం దాల్చడానికి
సిద్ధంగా ఉన్న ప్రజ్ఞాన్ ఆధునిక విజ్ఞానానికి
హంగులెన్నో అద్దడానికి సంసిద్ధంగా ఉంది.
చరిత్రపుటల్లో శాశ్విత ముద్రను
వేసిన ఘట్టానికి సాక్ష్యమైనందుకు
భారతీయుని అణువణువు ఆనందంతో ఉప్పొంగి పోతుంది.
అమ్మ చెప్పిన చందమామ రూపు
రేఖలు మారినా తన హృదయంలో
చోటిచ్చి మానవాళికి ఆశ్రయమిస్తుందో
లేదో ఇక వేచి చూడాలి.
– షేక్ నసీమాబేగం, 9490440865