అణచివేతే లక్ష్యంగా..

Target if suppressed..తొమ్మిదేండ్ల నరేంద్రమోడీ పాలనలో ప్రధాన స్రవం తిలోని ఒక ముఖ్యమైన విభాగం, ప్రభుత్వ ప్రచార విభా గంగా మారింది. ఇది హిందూత్వ అనుకూల మీడి యా సంస్థల ఆవిర్భావంతో సమానంగా ఉంది. ఇది అధికార పార్టీ అజెండాను సమర్థించి విస్తరిం చడమేకాక, మీడియా సంస్థలపై, విద్యావేత్తలపై, జర్నలి స్టులు, ప్రజామేధావులపై క్రమం తప్పకుండా దాడి చేస్తుంది. సవరించిన యూఏపిఏను ప్రభుత్వం, అణచి వేయడానికి ఉపయోగించడం, పౌరుల గోప్యత హక్కును రక్షించేందుకు అవసరమైన లేదా సరిపోని, అసమర్థమైన చట్టాలు, ఉగ్రవాదంపై, ప్రపంచ నిఘా సంస్థ అయిన ఫైనాన్షియల్‌ యాక్షన్‌ టాస్క్‌ఫోర్స్‌ (ఎఫ్‌ఎటిఎఫ్‌) సిఫార్సు లను, ఆర్థిక సహకారం, సైద్ధాంతిక విరోధులను తటస్థం చేయడం కోసం ఈ చట్టాలను తమ గుప్పిట్లో ఉంచు కుంటుంది.
న్యూయార్క్‌ టైమ్స్‌ ప్రచురించిన నివేదికలో ఒక పారా గ్రాఫ్‌లో మాత్రమే న్యూస్‌క్లిక్‌ గురించి ప్రస్థావన ఉంది. న్యూ ఢిల్లీలోని ఫిల్లింగ్‌షోలో, మిష్టర్‌ సింగమ్స్‌ నెట్‌వర్క్‌, న్యూస్‌ సైట్‌ న్యూస్‌క్లిక్‌కు ఆర్థిక సహాయం అందించిందని, అది చైనా మాట్లాడే అంశాలతో ఆసక్తిని రేకెత్తించిందని నివేదిక పేర్కొంది. తన వాదనను ధ్రువీకరించుకోవడం కోసం, న్యూస్‌క్లిక్‌ వీడియోను సూచించింది. అక్టోబరు2, 2019న ప్రచురింపబడిన వీడియో శీర్షిక ఈ విధంగా ఉంది. 1949లో నిర్వహించబడిన, చైనా విప్లవం 70వ వార్షికోత్సవం సందర్భంగా, పీపుల్స్‌ డిస్పాచ్‌, విప్లవ చరిత్ర ను పరిశీలిస్తుంది. అది చైనాను భూస్వామ్య దేశం నుండి సామ్యవాద లక్షణాలతో, ఒక ప్రపంచ శక్తిగా ఎలా మార్పు చెందిందో వివరిస్తుంది. నేటికీ, చైనా విప్లవ చరిత్ర శ్రామిక వర్గాలకు, ప్రజల పోరాటాలకు స్పూర్తినిస్తూనే ఉంది. పెట్టు బడిదారీ దోపిడీ, సామ్రాజ్యవాద దురాక్రమణకు వ్యతిరేక పోరాటాలకు స్పూర్తినిస్తున్నది. ఈ వీడియోను 10 వేల మందికి తక్కువగానే వీక్షించారు.
యాధృచ్ఛికంగా ఈ వెబ్‌సైట్‌, రష్యావిప్లవంపై ప్రసాద్‌ రాసిన ఒక భాగాన్ని ప్రచురించింది. డిసెంబర్‌ 2018లో చైనా 40 సంవత్సరాల సంస్కరణల గురించి న్యూస్‌ క్లిక్‌ కోసం చిన్న వ్యాసాన్ని రాశారు. డెంగ్జియావోపింగ్‌, చైనాను మావోయిస్టు అభివృద్ధి నమూనా నుండి, సోషలిస్టు సంస్థ లుగా, మార్కెట్‌ ఆర్థిక వ్యవస్థగా ఎలా మార్చారో వివరిం చారు. ఆసక్తికరమైన విషయం ఏమంటే, గత రెండేళ్లుగా న్యూస్‌ క్లిక్‌ చైనాకు సంబంధించి ప్రచురించిన కొన్ని కథనా లలో ఒకటి, కీలకమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులపై నెమ్మదిగా పురోగతిని వివరించే నివేదిక. గాల్వాన్‌ సంక్షోభం తరువాత, తూర్పు లడఖ్‌లోని ఫార్వర్డ్‌ ప్రాంతాలలో, ప్రవేశా నికి పరిమితులు, కమ్యునికేషన్‌ను పూర్తిగా నిషేధించడాన్ని గూర్చి ప్రచురించింది. మరొక ఆందోళన కలిగించే అంశం చైనా భారత భూభాగంలోకి ప్రవేశిం చిందని నిర్థారించే డాక్యుమెంట్‌, రక్షణ మంత్రిత్వశాఖ వెబ్‌సైట్‌ నుండి కనిపిం చకుండా పోయిందని.. క్యూరేటివ్‌ నివేదిక ఆందోళనకు దారితీసింది. జాతీయ ప్రయోజనాల దృష్ట్యా, బాహ్య, అంత ర్గత భద్రత కోసం,సైనికేతర రాజకీయ పరిష్కారం కోసం పిలుపు నిస్తూ ప్రభుత్వానికి 140మంది సైనిక అనుభవ జ్ఞులు పంపిన ప్రకటనను గురించి ఈ నివేదిక తెలియ చేస్తుంది.
దాని వీడియో విభాగంలో, పోర్టల్‌లో న్యూస్‌క్లిక్‌లో కన్సల్టెంట్‌ అయిన పరంజ్యోరు గుహా ఠాకుర్తా ద్వారా రక్షణ విశ్లేషకుడు, రిటైర్డ్‌ కర్నల్‌ అయిన అజరు శుక్లా ఇంటర్వూ ఉంది. ”ఎవరూ భారత భూభాగంలోకి ప్రవేశిం చలేదు. భారతీయ పోస్టులను ఎవరూ స్వాధీనం చేసుకో లేదు”అని 2000 జూన్‌లో ప్రధాని మోడీ చేసిన ప్రకటనపై శుక్లా ప్రశ్నలను లేవనెత్తారు.
ఇండియా-చైనా సంబంధాలపై, మాజీ నావీ అధికారి, చైనీస్‌ స్టడీస్‌లో సీనియర్‌ ఫెలో అయిన అతుల్‌ భరద్వాజ్‌ తో పుర్కాయస్థ హోస్ట్‌గా, ఇంటర్వ్యూ నిర్వహించారు. ఆ ఇంటర్యూ సారాంశం ఈ విధంగా ఉంది. ”విదేశాంగ మం త్రులు భారత చైనా దేశాల మధ్య ఉన్న ఏ ఒక్క అసాధారణ సమస్యను కూడా పరిష్కరించలేరు. భారతదేశానికి చైనాతో ఉన్న విస్తృతమైన ఆర్థిక సంబంధాలపై, భిన్న మైన దృక్పథాన్ని కలిగి ఉండడానికి భారత దేశం అంగీ కరిస్తే తప్ప ఇది సాధ్యం కాద”ని తెలిపారు.
న్యూస్‌క్లిక్‌ నివేదికలు, వ్యాఖ్యానాలు ఎల్లప్పుడూ, ఆశ్రిత పక్షపాత ధోరణిని(క్రోనీ క్యాపిటలిజమ్‌)ను తీవ్రంగా విమ ర్శిస్తాయి. ప్రజాప్రయోజనాలకు సంబంధించి, ప్రధాన స్రవంతి మీడియాలో ముఖ్యమైన సమస్యలపై, చోటు లభించని అంశాలపై, తన శక్తికి మించి స్పందిస్తుంది.
లా అండ్‌ ఆర్డర్‌ సమస్యలు, ఆర్థిక వ్యవస్థకు నష్టాలను సష్టించేందుకు, న్యూస్‌ క్లిక్‌ రైతుల ఆందోళనను ప్రేరేపించి నిధులను సమకూర్చిందని, ఆర్థిక వ్యవస్థకు నష్టం కలిగిం చిందని ఎఫ్‌ఐఆర్‌లో ఆరోపించారు. కోవిడ్‌ 19, పాండమిక్‌ ను నియంత్రించడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు వ్యతిరేకంగా, న్యూస్‌ క్లిక్‌ తప్పుడు కథనాన్ని అందించిందని కూడా ఆరోపించింది.
పోలీసులు ముందుగా వేసుకున్న పథకం ప్రకారం, దుర్దేశంతో వచ్చారని ప్రభుత్వం లక్ష్యంగా చేయబడిన అనేక మంది జర్నలిస్టులు ఫ్రంట్‌ లైన్‌తో చెప్పారు. ఈ భాగాన్ని ప్రారంభంలో ఉదహరించిన విలేకరి మాట్లాడుతూ, రైతుల నిరసనలను సిఏఏ వ్యతిరేక పోస్టులను కవర్‌ చేశారా? అని అడిగారు. అతను అవును అని చెప్పినప్పుడు, ”ఈ చట్టాలు జాతీయ ప్రయోజనాల కోసం రూపొందించబడ్డాయి. కానీ మీరు ప్రజలను తప్పుదారి పట్టించేందుకు తప్పుడు సమా చారాన్ని వ్యాప్తి చేస్తున్నారని” కోపగించుకున్నాడు. అహ్మద్‌ రషీద్‌ తాలిబాన్‌, మిలిటెంట్‌ ఇస్లాం, ఆయిల్‌ ఫండమెంట లిజమ్‌ ఇన్‌ సెంట్రల్‌ ఆసియా లాంటి పుస్తకాలు వారి వద్ద ఎందుకు ఉన్నాయని ప్రశ్నించాడు. జి-20 సదస్సును ఎందుకు ప్రచురించలేదని గుహా తకుర్తాను అడిగాడు.
ఎఫ్‌ఐఆర్‌లో, రాజ్యసభ ఎగ్జిక్యూటివ్‌ ఎడిటర్‌, ఫ్రీలాన్స్‌ కన్సల్టెంట్‌ ఉర్మిలేష్‌ పేరు కూడా ఉంది. సందేహాస్పద నిధు లు జాతి వ్యతిరేక కార్యకలాపాల కోసం మా మధ్య పంపిణీ చేయబడ్డాయని చెప్పాడు. న్యూస్‌క్లిక్‌ ఆఫీస్‌ లాక్‌ చేయబ డింది, కానీ ప్రధాన జాతీయ, అంతర్జాతీయ వార్తలకు స్పందిస్తూనే ఉంది.అక్టోబర్‌ 9న ”గాజా విషయంలో భారత వైఖరి ఎందుకు నిలకడగా లేదో తెలియజేస్తూ 10 కారణా లను మాజీ డిప్లొమాట్‌ భద్రకుమార్‌ ద్వారా ప్రచురించింది. అజరు గుడవర్తి, తన వ్యాసంలో ప్రజారంగాన్ని ఏ విధంగా నేరపూరితం చేస్తున్నారో తెలియజేస్తూ, మీడియాపై, ఇతర ప్రజాస్వామ్య సంస్థలపై దాడులను గూర్చి చర్చించారు.
ప్రముఖ పాత్రికేయుడు, న్యూస్‌క్లిప్‌ కన్సల్టెంట్‌ అయిన బిసార్‌శర్మ, తన యూట్యూబ్‌ చానల్లో తన పరికరా లను జప్తు చేసినప్పుడు, తనకు ఎలాంటి వారంటూ చూపిం చలేదని, ఎలాంటి కారణం చెప్పలేదని చెప్పాడు. ఉర్మిలేష్‌ ఇలా అన్నారు. ”ప్రజాస్వామ్య దేశంలో ఇది ఎప్పుడు జర గదు. వారు నా పుస్తకాలు లాప్టాప్‌, మొబైల్‌ ఫోనును జప్తు చేయాల్సింది కాదు”.
బలమైన రక్షణ చట్టం లేనప్పుడు, పరికరాల జప్తు మళ్ళీ జరుగుతుంది. ఒక లక్ష్యంతో నిఘా పెంచడం పై తమ అసమ్మతిని తెలియజేసింది. 18 మీడియా సంస్థల నిర్వాహకులు, ప్రెస్‌క్లబ్‌ ఆఫ్‌ ఇండియా, ఇండియన్‌ ఉమెన్‌ ప్రెస్‌కార్ప్స్‌, ఫౌండేషన్‌ ఫర్‌ మీడియా ఫ్రొఫెనల్స్‌ కలిసి పాత్రికేయులను విచారించే విధానం, వారి ఎలక్ట్రా నిక్‌ వస్తువులను స్వాధీనం చేసుకోవడంపై తగిన మార్గదర్శకాలు ఇవ్వాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ను డిమాండ్‌ చేస్తూ వినతి పత్రం సమర్పించారు.
కోడ్‌ ఆఫ్‌ క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ 7వ అధ్యాయం శోధన, జప్తు (సిఆర్‌పిసి) గురించి తెలియజేస్తుంది. తక్షణ శోధన అవసరమయ్యే సందర్భాలలో, పోలీసులు కారణా లను తెలియజేయాలి. కానీ, సెక్షన్‌ 165, 102 సిఆర్‌పిసి కేవలం అనుమానం ప్రాతిపదికన, ఆస్తిని శోధించడానికి, స్వాధీనం చేసుకోవడానికి ఈ సెక్షన్లు అనుమతిస్తాయి.
నిర్బంధించబడిన చాలామంది జర్నలిస్టులు తమ వద్ద జప్తు చేసిన పరికరాలకు, పోలీసులు వాటి విలువను ఇవ్వలేదని ఆరోపించారు. ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ చట్టం 2000 ప్రకారం, స్వాధీనం చేసుకున్న పరికరం, ఆష్‌ విలువను నమోదు చేయడం, చార్జ్‌షీట్‌తో పాటు కోర్టులో సమర్పించడానికి స్వాధీనం చేసుకున్న మెమో కాపీని అందించడం పోలీసుల నైతిక బాధ్యత.
ఈ అంశానికి సంబంధించిన కేసులో సుప్రీంకోర్టులో రెండు పిటిషన్లు పెండింగులో ఉన్నాయి. పిల్‌కు ప్రతి స్పందనగా కేంద్రం నవంబర్‌ 2022లో అఫిడవిట్‌ దాఖలు చేసింది. ఐదుగురు విద్యావేత్తలు దాఖలు చేసిన పిటిషన్‌, దర్యాప్తు సమయంలో డిజిటల్‌ పరికరాలను శోధించటం, స్వాధీనం చేసుకోవడం ”అత్యంత చట్టబద్ధ మైన రాష్ట్ర ప్రయోజనం” అని, గోప్యతా హక్కులను ఉల్లం ఘించినట్టు చెప్పలేమని పేర్కొంటూ, నిందితులు జప్తు చేయబడిన పరికరాలను తిరిగి పొందేందుకు లేక వాటి నమూనాలను పొందేందుకు ట్రైల్‌ కోర్టును ఆశ్రయించ వచ్చునని, కేంద్రం తెలిపింది.
ఫౌండేషన్‌ ఫర్‌ మీడియా ప్రొఫెషనల్స్‌ దాఖలు చేసిన మరో పిటిషన్‌, సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉంది. డిజిటల్‌ పరికరాలను శోధించటం లేక స్వాధీనం చేసుకునే సమయంలో పోలీసుల మితిమీరిన చర్యలను, సందేహా స్పద పద్ధతులను సంబంధించి నిందితులు ఆరోపిస్తు న్నారు. ఆగస్టు 2022లో ఢిల్లీ అల్లర్లకు సంబంధించి, సీని యర్‌ జర్నలిస్ట్‌ ప్రశాంత్‌ టాండన్‌ను ఢిల్లీ పోలీసులు ప్రశ్నిం చారు. పోలీసులు అతని మొబైల్‌ను స్వాధీనం చేసుకు న్నారు. దానిని ఇప్పటికీ అతనికి తిరిగి ఇవ్వలేదు.
టాండన్‌ ఇలా అన్నాడు. ”ఒకసారి ఎవరైనా మొబైల్‌ ఫోన్‌ లాక్కుంటే అందులో పోలీసులు ఏమి పెడతారో ఎవ రికి తెలుసు. భీమా కోరేగావ్‌ కేసులో నిందితుల కంప్యూ టర్లలో, సాక్ష్యాలను జొప్పించిన విషయాన్ని అంతర్జాతీయ మీడియా మనకు తెలియజేసింది. ప్రాథమిక సమస్య ఏమంటే, ”ప్రతి పౌరుడిని సహజంగానే ఉగ్రవాదిగా భావిం చడం” అని టాండన్‌ అంటారు. పుర్కాయస్థ ఇటీవల రాసిన వ్యాసంలో, బీజేపీ ప్రభుత్వం యుఎపిఎ, మనీలాండ రింగ్‌ నిరోధక లాంటి చట్టాలను విమర్శకులపై,ప్రత్యర్థులకు వ్యతిరేకంగా ఆయుధంగా వాడుకోవడాన్ని దుయ్యబట్టాడు. చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (యుఎపిఎ) ప్రయోగించబడిన రచయిత, చైర్మన్‌ ఆఫ్‌ ఆమ్నెస్టీ ఇంటర్నే షనల్‌ ఇండియా, ఆకార్‌పటేల్‌ ఫ్రంట్‌ లైన్‌తో మాట్లా డుతూ, ప్రభుత్వ యంత్రాంగం పదే పదే యుఎపిఎను, జర్నలిస్టులను, మానవ హక్కుల సమర్థకులను, కార్యకర్త లను వేధింపులకు గురిచేయడానికి, భయపెట్టడానికి ఆయుధంగా వాడుకుంటున్నదని తెలిపాడు. తమ అస్పష్ట మైన ఉగ్రవాద చట్టాల నిర్వచనాలతో, ఉచిత ట్రయల్‌ హక్కు లను ఉల్లంఘించేందుకు ఆయుధంగా ఉపయోగిం చుకుంటుంన్నది.
ఫ్రీ స్పీచ్‌ కలెక్టివ్‌ సమాచారం ప్రకారం, దాదాపు 16 మంది జర్నలిస్టులపై2010 నుండి యుఎపిఎ చట్టం ప్రకా రం అభియోగాలు మోపబడ్డాయి. కనీసం ఏడుగురు ఇప్ప టికీ జైలులోనే ఉన్నారు. న్యూస్‌ క్లిక్‌కు వ్యతిరేకంగా యుఎపి ఎను ప్రయోగించడం, ఆందోళన కలిగిస్తోందని, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి రాసిన సంయుక్త లేఖలో తెలిపారు. సిధ్ధిక్‌ కప్పన్‌కు రెండేళ్లకు పైగా జైలు శిక్ష విధిం చడం, ఫాదర్‌ స్టాన్‌స్వామి పోలీసు కస్టడీలో మరణించ డాన్ని ఉదాహరణగా చూపారు.
లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో న్యూస్‌క్లిక్‌ పై చర్య రాజకీయ కథనాలను నియంత్రించడానికి చేసిన ఒక దృఢమైన, నిస్సంకోచమైన ప్రయత్నమని చాలామంది పరిశీలకులు నమ్ముతున్నారు. ఒక స్వతంత్ర జర్నలిస్టు ఎ.జె. ప్రబాల్‌ తెల్పినట్లుగా, చాలా డిజిటల్‌ మీడియా ప్లాట్‌ ఫామ్స్‌ అవి ఏవీ ప్రభుత్వ రెవెన్యూపై గానీ, పత్రికా ప్రకటన లపైగానీ ఆధారపడి లేవు. గనుక మచ్చిక చేసుకోవడానికి అవకాశం లేకుండా పోయింది.
( ఫ్రంట్‌ లైన్‌ సౌజన్యంతో )
– మల్లెంపాటి వీరభద్రరావు, 9490300111

Spread the love