నవతెలంగాణ- చిట్యాల: చిట్యాల మున్సిపాలిటీ యువజన కాంగ్రెస్ అధ్యక్షులుగా జిట్ట చిన్నస్వామి నియమితులయ్యారు. ఈ మేరకు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గురువారం ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా చిన్న స్వామి మాట్లాడుతూ… యువజన కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కే శివసేనా రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. రానున్న ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేస్తానని, యువతరం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకుంటానని అన్నారు. సహకరించిన పార్టీ నాయకులకు పేరుపేరునా ఆయన కృతజ్ఞతలు తెలిపారు.