‘నాయకుడు’ తర్వాత కమల్‌హాసన్, మణిరత్నం కాంబోలో ఓ సినిమా (కెహెచ్234) ఇటీవల ప్రారంభమైన సంగతి తెలిసిందే. దాదాపు 35 ఏండ్ల తర్వాత ఈ క్రేజీ కాంబినేషన్ రిపీట్ కానుండటంతో ప్రేక్షకులంతా దీనిపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. తాజాగా ఈ సినిమాలోని కమల్‌హాసన్ ఫస్ట్‌లుక్‌ను రివీల్ చేసి చిత్ర బృందం అందరి అంచనాలను రెట్టింపు చేసింది. నేడు (మంగళవారం) కమల్‌హాసన్ బర్త్‌డే సందర్భంగా ‘థగ్ లైఫ్’ అనే టైటిల్‌ని ఖరారు చేస్తూ ఓ ప్రత్యేక వీడియోను నిర్మాణ సంస్థ రిలీజ్ చేసింది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో త్రిష, దుల్కర్ సల్మాన్, జయం రవి తదితర భారీ తారాగణమూ నటిస్తోంది. టైటిల్ అనౌన్స్మెంట్ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా త్రిష స్పందించారు. ‘కలలు చాలా సార్లు నెరవేరినప్పుడు ఎంత అదృష్టవంతులమని అనిపిస్తుంది. ‘థగ్ లైఫ్’లో భాగం కావడం, కమల్‌హాసన్, మణిరత్నంలతో మరోసారి కలిసి పని చేసే అవకాశం రావడం చాలా ఆనందంగా ఉంది. యూనివర్స్‌కు థ్యాంక్స్ చెప్పాలని ఉంది’ అంటూ త్రిష పేర్కొన్నారు.