Saturday, January 10, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నీటి ఎద్దడి నివారణకు బోరు వేయించిన సర్పంచ్

నీటి ఎద్దడి నివారణకు బోరు వేయించిన సర్పంచ్

- Advertisement -

నవతెలంగాణ – రాజోలి/ వడ్డేపల్లి
వడ్డేపల్లి మండలం జిల్లెడుదిన్నె గ్రామపంచాయతీ పరిధిలోని ప్రజా సమస్యల పరిష్కారానికి నూతనంగా ఎన్నికైన గ్రామ సర్పంచ్ సువర్ణమ్మ వైఫ్ ఆఫ్ వెంకటేశ్వర్ రెడ్డి ప్రత్యేకంగా పట్టు బిగించారు. జిల్లేడు దిన్నె గ్రామంలోని ఎస్సీ కాలనీలో నీటి కొరత అధిక సంఖ్యలో ఉందని గమనించిన ఆ గ్రామ సర్పంచ్ ప్రత్యేకంగా బోరు మోటర్ ను పిలిపించి ఎస్సీ కాలనీలో బోరు చేయించారు. నూతన సర్పంచ్ తీసుకున్న చర్య పట్ల అక్కడి కాలనీ ప్రజలు సర్పంచ్ పనితీరుపై హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సువర్ణమ్మా, వైఫ్ ఆఫ్ వెంకటేశ్వర రెడ్డి,  ఉప సర్పంచ్ రమేష్ పాటు బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, వార్డ్ సభ్యులు, గ్రామ పెద్దలు, ఎస్సీ కాలనీవాసులు,  పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు .

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -