Monday, April 27, 2026
E-PAPER
Homeసినిమా'వాలా'కి తెలుగులోనూ మంచి ఆదరణ

‘వాలా’కి తెలుగులోనూ మంచి ఆదరణ

- Advertisement -

కేరళ బాక్సాఫీస్‌ వద్ద అద్భుతమైన విజయాన్ని నమోదు చేసిన మల యాళ సంచలనం ‘వాలా ?’ ఇప్పుడు తెలుగులోనూ నాని మస్‌ బ్లాక్‌ బస్టర్‌ విజయాన్ని అందుకుంది.
సావిన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో హషీర్‌, అలన్‌ బిన్‌ సిరాజ్‌, అజిన్‌ జారు, వినాయక్‌ వంటి యువ నటీనటులు నటించారు. సాహు గారపాటి తన ‘షైన్‌ స్క్రీన్స్‌’ బ్యానర్‌పై, విపిన్‌ దాస్‌, హారిస్‌ అనిష్‌, ఆదర్శ్‌ నారాయణ్‌, ఐకాన్‌ స్టూడియోస్‌తో కలిసి నిర్మించిన ‘వాలా 2’ తెలుగులో ఈ నెల 24న థియేటర్లలో విడుదలై, అద్భుతమైన విజయాన్ని సాధించింది.
ఈ సందర్భంగా మేకర్స్‌ j¶నానిమస్‌ బ్లాక్‌బస్టర్‌ సక్సెస్‌మీట్‌ నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన హీరో సాయి దుర్గ తేజ్‌ మాట్లాడుతూ,”వాలా2 ‘ టీమ్‌ అందరికీ అభినందనలు. ఈ సినిమా వర్డ్‌ ఆఫ్‌ మౌత్‌తో పికప్‌ అయింది. షోలు హౌస్‌ఫుల్‌ అవుతున్నాయి. ఇలాగే అన్ని షోలు ఫుల్‌ కావాలని కోరుకుంటున్నాను. మంచి సినిమాకి ఎలాంటి సరిహద్దులు ఉండవు. మంచి సినిమాను అందరూ సపోర్ట్‌ చేయాలని కోరుకుంటున్నాను. సాహు ఈ సినిమాతో అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు’ అని తెలిపారు.
‘నేను ఈ సినిమాని థియేటర్‌లో చూసాను. ప్రతి క్యారెక్టర్‌ను చూసి చాలా ఎంజారు చేశాను. థియేటర్‌కు వెళ్లినప్పుడు.. మెల్లగా థియేటర్‌ మొత్తం హౌస్‌ఫుల్‌ అయింది. ఇది పెద్ద సక్సెస్‌. రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల హౌస్‌ఫుల్స్‌ పడుతున్నాయి. నేను కడుపుబ్బ నవ్వుకున్నాను. కొన్ని కామెడీ బ్లాక్స్‌ అదిరిపోయాయి. ప్రతి క్యారెక్టర్‌ చాలా సహజంగా కనిపించింది. మలయాళంలో పెద్ద హిట్‌. తెలుగులో కూడా అదే స్థాయిలో ఆడాలని కోరుకుంటున్నాను. తెలుగు డబ్బింగ్‌ అద్భుతంగా ఉంది. డైరెక్టర్‌ సావిన్‌ చాలా ప్యాషన్‌తో ఈ సినిమా తీశారు. సాహు గారపాటి వరుస విజయాలు సాధిస్తున్నారు’ అని హీరో నిఖిల్‌ సిద్ధార్థ్‌ చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -