హీరో తరుణ్ భాస్కర్ నటిస్తున్న తాజా చిత్రం ‘గాయపడ్డ సింహం’.ఈ చిత్రాన్ని పవన్ సదినేని సమర్పణలో, కళ్యాణ చక్రవర్తి మంథిన, భాను కిరణ్ ప్రతాప, విజరు కృష్ణ లింగమనేని, ఉమేష్ బన్సల్ సప్తస్వ మీడియా వర్క్స్, పిఓవి స్టోరీస్, జీ స్టూడియోస్ బ్యానర్ల పై నిర్మించారు. ఫరియా అబ్దుల్లా, మానస చౌదరి కథానాయికలుగా నటించారు.
రైటర్- డైరెక్టర్ కశ్యప్ శ్రీనివాస్ తెరకెక్కిస్తున్న ఈచిత్రం నుంచి లేటెస్ట్‌గా మేకర్స్ ఫోర్త్ సింగిల్ ‘ప్రేమకి పులిహోర..’ రిలీజ్ చేశారు.
టిపికల్ లవ్ సాంగ్‌లా కాకుండా, ‘ప్రేమకి పులిహోర’ మోడరన్ లవ్‌లో ఉండే అటుపోటులు, సరదా, అన్నీ అంశాలను సరదాగా ప్రజెంట్ చేస్తోంది.
తనకు నచ్చిన అమ్మాయిని ఆకట్టుకోవడానికి హీరో చేసే ప్రయత్నాలు, ఆ ప్రయాణంలో ఎదురయ్యే చిన్న చిన్న అడ్డంకులు అన్నీ ఈ పాటలో హ్యూమరస్‌గా, రిలేటబుల్‌గా ఆకట్టుకున్నాయి.
స్వీకర్ అగస్తి ఈ పాటకు లైట్, బ్రీజీ ఫీల్‌తో కూడిన ట్యూన్ అందించారు. మెలోడీకి అర్బన్ టచ్ జోడించి, స్టైలిష్ వ¶్యజిక్‌తో ఈ పాటను క్యాచీగా తీర్చిదిద్దారు. అనురాగ్ కులకర్ణి వోకల్, తరుణ్ భాస్కర్, మానస చౌదరి మధ్య కెమిస్ట్రీ ఈ పాటకు ప్రధాన ఆకర్షణ. వారి మధ్య జరిగే క్యూట్, సరదా క్షణాలు, స్టైలిష్ డ్యాన్స్ మెంట్స్ అన్నీ కలిసి ఈ పాటను మరింత ఆకర్షణీయంగా మార్చాయి. ఈ సినిమా మే 1వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
‘ప్రేమకు పులిహోర కలిపామా…’
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



