Sunday, April 26, 2026
E-PAPER
Homeసినిమాకేరళలో కీలక యాక్షన్‌ షెడ్యూల్‌

కేరళలో కీలక యాక్షన్‌ షెడ్యూల్‌

- Advertisement -

కథానాయిక రష్మిక మందన్న నటిస్తున్న పాన్‌ ఇండియా యాక్షన్‌ డ్రామా ‘మైసా’. రవీంద్ర పుల్లె దర్శకత్వంలో అన్‌ఫార్ములా ఫిల్మ్స్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.
తాజాగా కేరళలో 15 రోజుల బ్రూటల్‌ యాక్షన్‌ ప్యాక్డ్‌ షూటింగ్‌ షెడ్యూల్‌ ప్రారంభమైంది. కేచా ఖంపక్దీ మాస్టర్‌ హై వోల్టేజ్‌ యాక్షన్‌ కొరియోగ్రఫీని అందిస్తున్నారు. రష్మికతో పాటు కీలక నటీనటులు పాల్గొంటున్న ఈ యాక్షన్‌ షెడ్యూల్‌ సినిమాలో మేజర్‌ హైలెట్‌గా ఉండబోతుంది.
ఈ సినిమాలో రష్మిక ఒక గోండ్‌ గిరిజన అమ్మాయిగా కనిపించనుంది. ఈ పాత్రకు ఎమోషనల్‌ డెప్త్‌తో పాటు శారీరక దఢత్వం కూడా అవసరం. ఇందుకోసం రష్మిక అంతర్జాతీయ యాక్షన్‌ డైరెక్టర్‌ ఆండి లాంగ్‌ పర్య వేక్షణలో బ్యాంకాక్‌కు వెళ్లి కఠినమైన స్టంట్‌, కాంబాట్‌ ట్రైనింగ్‌ తీసుకున్నారు. రోజుకు దాదాపు ఎనిమిది గంటల పాటు అడ్వాన్డ్స్‌ స్టంట్స్‌, హ్యాండ్‌ టు హ్యాండ్‌ ఫైట్‌, హై స్పీడ్‌ యాక్షన్‌ టెక్నిక్స్‌ నేర్చుకున్నారు.
రష్మిక ఇప్పటివరకు చూడని ఇంటెన్స్‌, ఎక్స్‌ప్లోసివ్‌ అవతార్‌లో సంచలనం సష్టించేందుకు సిద్ధమవుతున్నారు.
ఈశ్వరీ రావు, గురు సోమసుందరం, రావు రమేష్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి రచన, దర్శకత్వం: రవీంద్ర పుల్లె, నిర్మాతలు: అన్‌ఫార్ములా ఫిల్మ్స్‌,
సంగీతం: జేక్స్‌ బిజోరు, డిఓపి: శ్రేయాస్‌

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -