Sunday, April 26, 2026
E-PAPER
Homeజాతీయంవాయనాడ్‌ నిధుల వివాదం

వాయనాడ్‌ నిధుల వివాదం

- Advertisement -

– యాప్‌ డేటా పారదర్శకతపై ప్రశ్నలెన్నో..!
తిరువనంతపురం:
ముండక్కై-చూరల్మల కొండచరియల బాధితులకు ఇండ్లు నిర్మించేందుకు నిధుల సేకరణకు ప్రారంభించిన వాయనాడ్‌ నిధుల వినియోగం వివాదాస్పదంగా మారింది. ఆన్‌లైన్‌ నుంచి .. ఆ తర్వాత ఆఫ్‌లైన్‌కు తీసుకువెళ్లిన కాంగ్రెస్‌ పార్టీ ‘స్టాండ్‌ విత్‌ వాయనాడ్‌’ యాప్‌కు సంబంధించిన డేటాపై ఐటీ నిపుణుడు రజిత్‌ రామచంద్రన్‌ ఒక వివరణాత్మక ఫేస్‌బుక్‌ పోస్ట్‌ ద్వారా బహిర్గతం చేశారు. పార్టీ బహిరంగంగా విడుదల చేసిన గణాంకాలకు, యాప్‌ రికార్డులకు మధ్య తీవ్రమైన వ్యత్యాసాలు ఉన్నాయని ఈ పోస్ట్‌ వెల్లడించింది.రజిత్‌ వివరాల ప్రకారం… 22,702 విజయవంతమైన లావాదేవీల ద్వారా యాప్‌ మొత్తం రూ. 3,78,68,718 వసూలు చేసినట్టు నమోదు చేసింది. అయితే, జిల్లా వారీగా వివరాలు చూస్తే అస్పష్ట గణాంకాలు కనిపిస్తున్నాయి. ఎర్నాకుళంతో సహా చాలా జిల్లాల్లో రూ.15 లక్షల కంటే తక్కువ వసూళ్లు నమోదు కాగా, కొట్టాయం వంటి కాంగ్రెస్‌ కంచుకోటలో రూ. 4 లక్షల కంటే తక్కువ వసూళ్లు నమోదయ్యాయి. సేవా సంస్థలు, ప్రవాస సంఘాల నుంచి అందిన భారీ విరాళాలు యాప్‌ రికార్డులలో పూర్తిగా కనబడటం లేదు. అంతేకాక సెప్టెంబర్‌ 2024కు సంబంధించిన పూర్తి డేటా మాయమైంది. ఆ నెల లావాదేవీలన్నీ గల్లంతయ్యాయి. యాప్‌లో రూ.10 లక్షలు, రూ.20 లక్షల చొప్పున జరిగిన రెండు ఆఫ్‌లైన్‌ వసూళ్ల రికార్డులు కనిపిస్తున్నప్పటికీ, బహిరంగంగా విడుదల చేసిన గణాంకాలకు, యాప్‌ అంతర్గత గణాంకాలకు మధ్య ఎటువంటి పొంతన లేదు. గణాంకాల గారడీతో ఆ మొత్తం సరిపోయేలా సర్దుబాటు చేసినట్టు తేలింది.ఇప్పటికే పెరుగుతున్న వైరుధ్యాల నేపథ్యంలో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. దేశవ్యాప్త, విదేశీ వసూళ్లు ఉన్నప్పటికీ పార్టీ ఖాతాలోకి కేవలం రూ.5.38 కోట్లు మాత్రమే చేరాయని కేపీసీసీ అధ్యక్షుడు సన్నీ జోసెఫ్‌ గతంలో పేర్కొన్నారు. కాంగ్రెస్‌ వర్గాలు సుమారు రూ.150 కోట్ల వసూళ్లు జరిగినట్టు సూచించిన నేపథ్యంలో ఈ అంకె నమ్మశక్యం కానిదిగా విస్తృతంగా పరిగణించబడుతోంది. సోషల్‌ మీడియాలో ప్రచారంలో ఉన్న స్క్రీన్‌షాట్‌లు, యాప్‌ స్వయంగా రూ.54 కోట్లకు పైగా వసూళ్లను నమోదు చేసినట్టు చూపించాయి.జులై 31 అర్ధరాత్రి సంభవించిన విపత్తు జరిగిన వ¶డు రోజుల తర్వాత, అంటే ఆగస్టు 3, 2024న, కాంగ్రెస్‌ నాయకులు కె. సుధాకరన్‌ , వీడీ సతీసన్‌..కేరళ ప్రభుత్వ సహకారం లేకుండా తమ పార్టీ స్వతంత్రంగా వంద ఇండ్లను నిర్మిస్తుందని ప్రకటించారు. ఆగస్టు 21న నిధుల సేకరణ యాప్‌ను ప్రారంభించారు. వివిధ రాష్ట్రాల కాంగ్రెస్‌ j¶నిట్లు, ప్రవాస సంఘాలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ఎన్నికైన ప్రతినిధులు , సేవా సంస్థల నుంచి విరాళాలు వెల్లువెత్తినట్టు సమాచారం. ఈ వెల్లడింపులు, విపత్తు బాధితుల పేరుతో సేకరించిన నిధుల జవాబుదారీతనం, పారదర్శకతపై ప్రశ్నలను మరింత తీవ్రతరం చేశాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -