– చట్టసభల్లో వారి ప్రాతినిధ్యం అవసరం ‘సర్’తో ప్రజాస్వామ్య హక్కులు లాక్కోవాలని చూస్తున్న బీజేపీ
– ఓటుహక్కు పునరుద్ధరణకు వామపక్షాల పోరాటం: సీపీఐ(ఎం) పశ్చిమబెంగాల్ రాష్ట్ర కార్యదర్శి ఎండీ సలీం
నవతెలంగాణ – న్యూఢిల్లీ బ్యూరో
పేదలు, శ్రామిక ప్రజల కోసం నిలిచేది వామపక్షాలేనని సీపీఐ(ఎం) పశ్చిమ బెంగాల్ రాష్ట్ర కార్యదర్శి ఎండీ సలీం అన్నారు. ప్రస్తుత అసెంబ్లీలో వామపక్ష ప్రతినిధులు లేకపోవ డంతో పేదలు, శ్రామిక ప్రజలపై అణచివేత పెరిగిందన్నారు. సర్ పేరుతో ప్రజలను భయపెట్టి వారి ప్రజాస్వామ్య హక్కులను బీజేపీ లాక్కోవాలని చూస్తోందని విమర్శించారు. మతం, పేర్ల స్పెల్లింగ్ ఆధారంగా ప్రజలను ‘వివక్ష’కు గురిచేసి, ఓటర్ల జాబితా నుంచి వారిని మినహాయించే ప్రయత్నం జరుగుతోం దన్నారు. ఇప్పటికే ప్రచురించిన జాబితా ప్రకారం, అవినీతితో సంబంధం ఉన్న నాయకుల పేర్లు విచారణలో లేవని, కానీ పేద కార్మికుల పేర్లున్నాయని తెలిపారు. నిజమైన ఓటర్లకు ఓటు హక్కును పునరుద్ధరించడానికి వామపక్షాలు నిశ్చయించుకున్నా యన్నారు. సీపీఐ(ఎం) తరఫున పోటీచేస్తున్న అమ్తా నియోజక వర్గ అభ్యర్థి జసీముద్దీన్ మాలిక్, ఉలుబేరియా నార్త్ నియోజకవర్గం అభ్యర్థి అశోక్ దలురు, ఉదయనారాయణ్ నియోజకవర్గ అభ్యర్థి షష్టి మాజీలకు మద్దతుగా అమర్ ఫుట్‌బాల్ గ్రౌండ్‌లో భారీ ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీలో ఎండీ సలీం మాట్లాడుతూ లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో మోడీ, సీఎం, వారి ప్రతినిధులు తమను తాము గెలిపించుకోనేందుకు ప్రయత్నిస్తున్నారని సలీం అన్నారు. కానీ వామపక్ష నేతలు ప్రజల ప్రతినిధులను ఎన్నుకోవాలని కోరుతారన్నారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల ప్రతినిధులను అసెంబ్లీకి పంపడం వామపక్షవాదుల బాధ్యత అని నొక్కిచెప్పారు. శాసనసభలో వామపక్ష ప్రతినిధులు లేకపోవడం వల్ల పేద, శ్రామిక ప్రజలపై అణచివేత పెరుగుతోందని ఆయన అన్నారు.
ఎన్నికల సంఘాన్ని ముందుంచి బీజేపీ సంకీర్ణ ప్రభుత్వాన్ని నడుపుతోందని ధ్వజమెత్తారు. సర్ పేరుతో ఓటర్ల జాబితాను అపహాస్యం చేస్తున్నారని మండిపడ్డారు. దీనికి వ్యతిరేకంగా వామపక్షాలు ఉద్యమం నిర్వహిస్తాయని ఆయన తెలిపారు. గతంలో ప్రజాస్వామ్య హక్కులను లాక్కోవడానికి ప్రయత్నించిన ప్రతిసారీ వామక్షాలు దేశ ప్రజల పక్షాన నిలబడి వారి హక్కులను పరిరక్షించాయన్నారు. ఈసారి కూడా ఓటు హక్కును పునరుద్ధరించే పోరాటంలో వామపక్షాలు అగ్రభాగాన నిలుస్తాయన్నారు. దేశంలో మితవాద శక్తులు విజృంభించినప్పుడు, ప్రజలు సాధించుకున్న ప్రజాస్వామ్య హక్కులను లాక్కోవడానికి ప్రయత్నాలు జరుగుతాయన్నారు. రాష్ట్రంలో మితవాద శక్తులన్నీ ఏకమై, రాష్ట్రంలో లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వాన్ని తొలగించి, ప్రజల విద్య, ఆరోగ్యం, ఉపాధి హక్కు, అన్యాయానికి వ్యతిరేకంగా మాట్లాడే హక్కును లాక్కోవాలని చూస్తున్నాయని ఆయన ధ్వజమెత్తారు.
రాష్ట్రంలోని అన్ని నియామక ప్రక్రియల్లో అవినీతి జరిగిందని సలీం విమర్శించారు. ఈ అవినీతికి బీజేపీ వేదిక కల్పించిందని దుయ్యబట్టారు. రాష్ట్రంలోని తృణవ¶ల్ కాంగ్రెస్, నిరుద్యోగ యువత ఉపాధి హక్కును లాక్కొని రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. వామపక్షాలు చాలా కాలంగా అందరికీ ఉపాధి కల్పించాలనే డిమాండ్ కోసం పోరాడుతున్నాయన్నారు. వామపక్షాలు ప్రజల కోసం రాజకీయాలు చేస్తాయని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ, తృణవ¶ల్ కాంగ్రెస్ రాజకీయాలు చేసి ప్రజల్లో విభజన సృష్టించాలని చూస్తున్నాయని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రజలు సాధించుకున్న ప్రజాస్వామ్య హక్కులను పునరుద్ధరించడానికి అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్ష, ప్రజాస్వామ్య, లౌకిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని మహమ్మద్ సలీం పిలుపునిచ్చారు.
పేదలు, శ్రామికుల పక్షాన నిలిచేది వామపక్షాలే
- Advertisement -
- Advertisement -



