- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: కాసేపట్లో రెండో విడత పోలింగ్ ప్రచారం ముగియనుంది. ఈ తరుణంలో బెంగాల్‌లోని ఆరాంబాగ్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉద్రిక్తత నెలకొంది. టీఎంసీ జనరల్ సెక్రటరీ అభిషేక్ బెనర్జీ నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ఆ పార్టీ ఎంపీ మిధాలి బాగ్ కాన్వాయ్‌పై బీజేపీ శ్రేణులు రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో ఆమె కూర్చున్న కారు డోర్ అద్దాలు పగిలిపోయ్యాయి. ఆమెకు గాయాలు కాగా స్థానిక ఆస్పత్రికి తరలించినట్లు టీఎంసీ శ్రేణులు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
- Advertisement -



