Monday, April 27, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రజల గొంతుక బీఆర్ఎస్ పార్టీ 

ప్రజల గొంతుక బీఆర్ఎస్ పార్టీ 

- Advertisement -

పార్టీ బలోపేతంకు కృషి చెయ్యాల
సీనియర్ నేత..గుడిసెల నర్సింలు గౌడ్ 
నవతెలంగాణ-నసురుల్లాబాద్ 

భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నసురుల్లాబాద్, బీర్కూర్ మండలాల్లో సోమవారం బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. నసురుల్లా పట్టు వండర్ కేంద్రంలో ఆ పార్టీ సీనియర్ నేత గుడిసెల నర్సింలు గౌడ్ అధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ తల్లి చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించి, అక్కడే కేక్ కట్ చేసి, అక్కడ ఏర్పాటు చేసిన పార్టీ జెండాను ఎగురవేసి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

ప్రభుత్వ ఏర్పాటే లక్ష్యంగా కార్యకర్తలు పని చేయాలని ఈ సంద‌ర్భంగా నర్సింలు గౌడ్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సాధన కోసం కెసిఆర్ ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ కోసం14 సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణ సాధించిన అనంతరం బీఆర్ఎస్ పార్టీగా ఏర్పడిందన్నారు. రాష్ట్ర ప్రజల సమస్యల గొంతుగా బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుందన్నారు. కార్యక్రమంలో మండల పార్టీ నాయకులు టేకుర్ల సాయిలు, గంపల శంకర్, రమేష్, మోసిన్, భాస్కర్ , బద్రి, భూమయ్య, సాయిలు, గంగారం, శంకర్, శివ, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -