Monday, April 27, 2026
E-PAPER
Homeతాజా వార్తలుఏప్రిల్ 28 నుండి మే 5 వరకు కొనుగోలు కేంద్రాల సందర్శన

ఏప్రిల్ 28 నుండి మే 5 వరకు కొనుగోలు కేంద్రాల సందర్శన

- Advertisement -
  • తెలంగాణ రైతు సంఘం పిలుపు.
    న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర 3వ మహాసభలు కొత్తగూడెంలో విజయవంతంగా జరిగాయని, మహాసభలలో 32 తీర్మానాలను ఆమోదించామని, 93 మందితో నూతన కమిటీ 29 మందితో ఆఫీస్‌బేరర్స్ ఎన్నికయ్యారని హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సోమవారం(ఏప్రిల్ 27) జరిగిన విలేకరుల సమావేశంలో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తీగల సాగర్, రాష్ట్ర కోశాధికారి మూడ్ శోభన్, రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రొ.. అరిబండి ప్రసాదరావులు ప్రకటించారు.

నూతన కమిటీలో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా పోతినేని సుదర్శన్ రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా తీగల సాగర్, రాష్ట్ర కోశాధికారిగా మూడ్ శోభన్, రాష్ట్ర ఉపాధ్యక్షులుగా జూలకంటి రంగారెడ్డి, నంద్యాల నర్సింహ్మారెడ్డి, పి. జంగారెడ్డి, ప్రొ॥అరిబండి ప్రసాదరావు(రాష్ట్రకేంద్రం), మాదినేని రమేష్ (ఖమ్మం), కందాల ప్రమీల, ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి (నల్గొండ), శెట్టి వెంకన్న (మహబూబాబాద్), యం శ్రీనివాస్ (నాగర్‌కర్నూల్), వర్ణ వెంకట్‌రెడ్డి (కరీంనగర్), మల్లు నాగార్జున రెడ్డి (సూర్యాపేట), తుమ్మల వెంకట్‌రెడ్డి (ములుగు), సహాయ కార్యదర్శులుగా అన్నవరపు సత్యనారాయణ (భద్రాద్రి కొత్తగూడెం), బొంతు రాంబాబు (ఖమ్మం), వీరేపల్లి వెంకటేశ్వర్లు (నల్గొండ), మాటూరిబాలరాజుగెšడ్ (యాదాద్రి భువనగిరి), ఈసంపల్లి బాబు (వరంగల్), డి బాల్‌రెడ్డి (వనపర్తి), పల్లపు వెంకటేష్ (నిజామాబాద్), లెల్లెల బాలకృష్ణ (మత్స్య కార్మికుల సంఘం), శీలం ఫకీరమ్మ (ఖమ్మం), కొక్కెరపాటిపుల్లయ్య (పామాయిల్ రైతు సంఘం), భూక్యా చందూనాయక్ (జనగాం), కొంగరి వెంకట్ మావో (సిద్దిపేట), దుబ్బాక రాంచందర్ (రంగారెడ్డి), ఉడతా రవీందర్ (గొర్రెల మేకల పెంపకందారుల సంఘం) ఎన్నికయ్యారని తెలిపారు.

మహాసభ ఆమోదించిన తీర్మానాలు:

  1. వ్యవసాయ ప్రణాళికను శాస్త్రీయంగా ప్రభుత్వం అమలు జరపాలి.
  2. భూభారతి చట్టాన్ని రైతులకు ప్రయోజనకరంగా సవరించి, అమలు చేయాలి.
  3. ప్రత్యామ్నాయ పంటల విధానం రూపొందించాలి.
  4. రాష్ట్ర ప్రభుత్వం విత్తన చట్టం రూపొందించి అమలు చేయాలి.
  5. ప్రాధాన్యతా క్రమంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాల్ని పూర్తి చేయాలి.
  6. రుణమాఫీ చట్టాన్ని పార్లమెంట్ ఆమోదించాలి. పంటల రుణప్రణాళికను అమలు చేయాలి.
  7. రాష్ట్రంలో పంటల బీమా పథకాన్ని రూపొందించి రైతుల ప్రయోజనాలను కాపాడాలి.
  8. వ్యవసాయం మార్కెట్ చట్టాన్ని సవరించి, గిట్టుబాటు ధరలు కల్పించాలి.
  9. దిగుమతుల వలన రాష్ట్ర రైతుల ప్రయోజనాలు దెబ్బతినకుండా ఆంక్షలు విధించాలి.
  10. సన్న, చిన్నకారు రైతులకు వ్యవసాయ యాంత్రీకరణ వ్యవస్థను ఏర్పాటు చేయాలి.
  11. బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి నిధులు పెంచాలి.
  12. పోడు భూములు సాగు చేస్తున్న వారికి హక్కు పత్రాలు ఇవ్వాలి.
  13. సమగ్ర ఉత్పత్తిఖర్చు ఆధారంగా మద్ధతు ధరలను నిర్ణయించి, కొనుగోలుకు గ్యారంటీ చేస్తూ చట్టం చేయాలి.
  14. కౌలు రైతుల సమస్యలను చట్ట పరంగా పరిష్కరించి, రక్షణలు కల్పించాలి.
  15. వ్యవసాయ రంగంలో మతోన్మాద ప్రమాదాన్ని నిషేధించాలి.
  16. విత్తనోత్పత్తి రైతులకు శాస్త్ర సాంకేతిక సహాయం అందించి విత్తన పంటలకు రక్షణ కల్పించాలి.
  17. మహిళా రైతులకు భూహక్కులు కల్పించాలి. మహిళా రైతుల అభివృద్ధికి కృషి చేయాలి.
  18. హార్టికల్చర్ పంటలను ప్రోత్సహించి రైతులకు మార్కెట్ సౌకర్యం కల్పించాలి.
  19. వ్యవసాయ ప్రాసెసింగ్ యÖనిట్లను విస్తృతంగా ఏర్పాటు చేయాలి.
  20. వ్యవసాయ అనుబంధ రంగాలను అభివృద్ది చేసి రైతులకు అదనపు ఆదాయం కల్పించాలి.
  21. పాల ఉత్పత్తి ` రైతులకు న్యాయమైన ధర చెల్లించి రాయితీలు ఇవ్వాలి. 22. చెరుకు మిల్లులను తెరిపించి సాగు విస్తీర్ణం పెంచాలి.
  22. తగినన్ని శీతల, సాధారణ గిడ్డంగుల సౌకర్యాన్ని కల్పించాలి.
  23. పత్తి పంటపై ప్రభుత్వ విధానాలు` మార్కెట్‌లో అక్రమ వ్యాపారాలను అరికట్టాలి.
  24. రైతు సంక్షేమ కమిషన్ పనిని మరింత పటిష్టపరచాలి. 26. సమయానుకూల ఎరువుల సరఫరా నిర్వహణ . 27. తెలంగాణలో అధికంగా ఉన్న వ్యవసాయోత్పత్తుల ఉత్పత్తి ఖర్చు ` తగు చర్యలకై డిమాండ్.
  25. రాష్ట్ర స్థాయిలో వ్యవసాయోత్పత్తుల ధరల నిర్ణయ కమిషన్ ఏర్పాటు చేయాలి.
  26. పామాయిల్ రైతుల సమస్యలు పరిష్కరించాలి.
  27. మిర్చి బోర్డు ఏర్పాటు చేయాలి. పసుపు బోర్డుకు నిధులు కేటాయించాలి.
  28. మామిడి రైతులకు మద్దతు ధర, బోనస్ ఇవ్వాలి. దళారి వ్యవస్థను అరికట్టాలి.
  29. సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలి.

కర్తవ్యాలు:

1. ఏప్రిల్ 28 నుండి మే 5 వరకు పంటల కొనుగోలు కేంద్రాల సందర్శన, 2. ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని రాష్ట్ర వ్యాపిత ప్రచారం, 3. కౌలు రైతులకు 2011 చట్టం ప్రకారం హక్కుపత్రాలు ఇవ్వాలని రాష్ట్ర వ్యాపిత ఆందోళనలు, 4. అటవీ హక్కుల చట్టం 2006 ప్రకారం హక్కుపత్రాలు ఇవ్వాలని ఏజెన్సీ జిల్లాలలో సదస్సులు, 5. పాల రైతులకు పెండింగ్ బిల్లులు చెల్లించాలని, లీటర్‌కు రూ.5 ఇన్సెంటివ్ ఇవ్వాలని అధికారులకువినతిపత్రాలు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -