కార్మిక విభాగం సెక్రటరీ
నవతెలంగాణ-నాచారం
కార్మిక విభాగం నూతన సెక్రటరీగా బాధ్యతలు స్వీకరించిన హరిచందనను తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘానికి చెందిన ఈఎస్ఐ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు డా. చీమ శ్రీనివాస్, ఉపాధ్యక్షులు డా. దుర్గా పద్మజ, సభ్యులు డా. సతీష్, డా. కళ్యాణ్, డా. వెంకట రెడ్డి, డా. రవి పాల్గొన్నారు. సమావేశంలో ఈఎస్ఐ పరిధిలో ఎదురవుతున్న పలు సమస్యలను సెక్రటరీ దృష్టికి తీసుకువచ్చి, వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని వైద్యులు విజ్ఞప్తి చేశారు. దీనికి స్పందించిన హరిచందన, సమస్యలను సమగ్రంగా పరిశీలించి త్వరలోనే ప్రత్యేక రివ్యూ మీటింగ్ నిర్వహించి పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. అదేవిధంగా కార్మికులకు మెరుగైన వైద్య సేవలు అందించడం అత్యంత ముఖ్యమని పేర్కొంటూ, వైద్యులు తమ బాధ్యతలను నిబద్ధతతో నిర్వహించాలని ఆమె సూచించారు.
ఈఎస్ఐ సమస్యలపై త్వరలో రివ్యూ మీటింగ్: కలెక్టర్ హరిచందన
- Advertisement -
- Advertisement -



