Monday, April 27, 2026
E-PAPER
Homeతాజా వార్తలుఎప్‌సెట్‌ హాల్‌టికెట్లు విడుద‌ల‌

ఎప్‌సెట్‌ హాల్‌టికెట్లు విడుద‌ల‌

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: తెలంగాణలో మే 9 నుంచి 11 వరకు జరగనున్న ఎప్‌సెట్‌ (ఇంజినీరింగ్‌) పరీక్షకు హాల్‌టికెట్లు సోమవారం విడుదలయ్యాయి. ఇటీవల అగ్రికల్చర్‌, ఫార్మా విభాగం పరీక్ష హాల్ ‌టికెట్లు అందుబాటులోకి తీసుకొచ్చిన అధికారులు.. తాజాగా ఇంజినీరింగ్‌ విభాగం పరీక్ష రాసే విద్యార్థుల హాల్‌టికెట్లను వెబ్‌సైట్‌లో ఉంచారు. ఇంజినీరింగ్‌ పరీక్షను ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు మొదటి సెషన్‌; మధ్యాహ్నం 3గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు రెండో సెషన్‌ నిర్వహిస్తారు. విద్యార్థులు https://eapcet.tgche.ac.in వెబ్‌సైట్‌లోని ఆన్‌లైన్‌ అప్లికేషన్‌ విభాగంలో Download Hall Ticket (E,A&P)పై క్లిక్‌ చేసి తమ రిజిస్ట్రేషన్‌ నంబర్‌, క్వాలిఫైయింగ్‌ ఎగ్జామినేషన్‌ హాల్‌టికెట్ నంబర్‌, పుట్టిన తేదీ వివరాలను ఎంటర్‌ చేసి హాల్‌టికెట్లను నేరుగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా మే 4, 5 తేదీల్లో జరిగే అగ్రికల్చర్‌, ఫార్మా విభాగం పరీక్షకు 106, మే 9 నుంచి 11 వరకు జరిగే ఇంజినీరింగ్‌ పరీక్షకు 115 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇంజినీరింగ్‌ విభాగానికి ఏప్రిల్‌ 22 వరకు 2,10,308 మంది, అగ్రికల్చర్‌ విభాగానికి 90,569 మంది దరఖాస్తు చేశారని తెలిపారు. భారీ ఆలస్య రుసుంతో దరఖాస్తునకు మే 2వరకు అవకాశం ఉండటంతో ఈ సంఖ్య స్వల్పంగా పెరిగే అవకాశముంది. ఈ టీజీ ఎప్‌సెట్‌ రాసేందుకు ప్రిపరేషన్‌ కొనసాగిస్తున్న విద్యార్థుల కోసం ఉన్నత విద్యామండలి అధికారులు ఇప్పటికే మాక్‌ టెస్టులను అందుబాటులో ఉంచారు. వీటిని రాయడం ద్వారా ఈ పరీక్షకు సంబంధించి రియల్‌ టైం అనుభవంతో పాటు పరీక్షలో వేగం, కచ్చితత్వం పెంచుకోవచ్చు. ఎక్కడ వెనకబడి ఉన్నారో, సమయం ఎక్కడ వృథా అవుతుందో గుర్తించి తదనుగుణంగా మీ స్ట్రైక్‌ రేట్‌ని మెరుగుపరుచుకొనేలా తదుపరి ప్రిపరేషన్‌ను ప్లాన్‌ చేసుకొని ఉత్తమ ఫలితాలు సాధించవచ్చు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -