Monday, August 31, 2026
E-PAPER
Homeతాజా వార్తలుఅసోంలో ఘోర రోడ్డు ప్రమాదం.. డ్రైవర్ సహా ఆరుగురు మృతి

అసోంలో ఘోర రోడ్డు ప్రమాదం.. డ్రైవర్ సహా ఆరుగురు మృతి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : అసోంలో ఆదివారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గువాహటి–సోనాపూర్ జాతీయ రహదారిపై నలగేడెర వద్ద ప్రయాణికులతో ఉన్న మినీ ట్రావెలర్‌ బస్సు, ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ట్రావెలర్ బస్సు డ్రైవర్ సహా ఆరుగురు మృతిచెందగా, పలువురు గాయపడ్డారు. నాగావ్‌ నుంచి గువాహటికి వెళ్తుండగా వాహనం టైర్‌ పంక్చర్ కావడంతో అదుపుతప్పి డివైడర్‌ను దాటి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొన్నట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -