నవతెలంగాణ – హైదరాబాద్ : ద్విచక్ర వాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు యువకులు దుర్మరణం పాలయ్యారు. వివరాల్లోకి వెళితే.. ముగ్గురు యువకులు ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తుండగా, నల్లమాడ మండలం అరవవాండ్లపల్లి వద్ద బైక్ అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ క్రమంలో బైక్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగి వాహనం పూర్తిగా కాలిబూడిదైంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ప్రమాదం జరిగిన తీరుపై స్థానికులను అడిగి వివరాలు సేకరించారు. మృతులను పుట్టపర్తికి చెందిన అనిల్, కొత్తచెరువు వాసి అర్జున్, గోరంట్లకు చెందిన దీక్షిత్‌గా పోలీసులు గుర్తించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు వెల్లడించారు.
ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



