Monday, August 31, 2026
E-PAPER
Homeతాజా వార్తలులారీని ఢీకొట్టిన కారు.. డ్రైవర్‌ సజీవదహనం

లారీని ఢీకొట్టిన కారు.. డ్రైవర్‌ సజీవదహనం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : విశాఖ జిల్లా ఆనందపురం-పెందుర్తి రహదారిపై సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒడిశా నుంచి వస్తున్న కారు సత్తార్వు జంక్షన్ వద్ద ముందు వెళ్తున్న లారీని ఢీ కొట్టింది. అనంతరం పక్కనే ఉన్న డివైడర్‌ని ఢీకొట్టింది. దీంతో కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. కారు డ్రైవర్ సజీవదహనమయ్యాడు. మాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకునేలోపే కారు పూర్తిగా కాలిపోయింది. ఆనందపురం ఎస్సై శివ సంఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. ప్రమాద సమయంలో కారు నంబర్‌ ప్లేట్‌ లారీకి చిక్కుకున్నట్లు గుర్తించారు.మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -