Monday, April 27, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఇజ్రాయెల్‌తో ప్రత్యక్ష చర్చలను తిరస్కరిస్తున్నాం: హెజ్జుల్లా

ఇజ్రాయెల్‌తో ప్రత్యక్ష చర్చలను తిరస్కరిస్తున్నాం: హెజ్జుల్లా

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: లెబనాన్‌‌పై ఇజ్రాయిల్‌ ‌భీకర దాడులు కొనసాగించింది. ఈ నేపథ్యంలోనే ఇజ్రాయిల్‌ మూడు వారాలు కాల్పుల విరమణ పాటిస్తుందని ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ‌ప్రకటించారు. అయితే ట్రంప్‌ ‌ప్రకటించిన కొన్ని గంటల వ్యవధిలోనే ఇజ్రాయిల్‌ లెబనాన్‌‌పై దాడికి పాల్పడింది. ఈ నేపథ్యంలో లెబనాన్‌ ఇజ్రాయిల్‌‌తో ప్రత్యక్ష చర్చలకు ‌సన్నద్ధమవుతోంది. ఈ చర్చలపై హెజ్జుల్లా నాయకుడు సోమవారం కీలక వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయిల్‌‌తో లెబనాన్‌ ‌ప్రత్యక్ష చర్చలు చేస్తే.. అవి లెబనాన్‌‌నే అస్థిరపరుస్తాయని ‌సోమవారం హెజ్బుల్లా నాయకుడు నజీమ్‌ ‌ఖాసిమ్‌ హెచ్చరించారు. ఇజ్రాయిల్‌‌తో లెబనాన్‌ జరిపే చర్చలను ఆయన తిరస్కరించారు. ‌లెబనాన్‌ అధికార పక్షం చర్చల పేరిట ఘోర పాపానికి పాల్పడుతుందని ఆయన తీవ్రంగా మండిపడ్డారు. ఈ మేరకు తాజాగా విడుదల చేసిన ప్రకటనలో ఆయన పేర్కొన్నారు.

‘మేము ఇజ్రాయెల్‌తో ప్రత్యక్ష చర్చలను ఖచ్చితంగా తిరస్కరిస్తున్నాము. అధికారంలో ఉన్నవారు తమ చర్యల వల్ల లెబనాన్‌కు గానీ, తమకు గానీ ప్రయోజనం చేకూరదని తెలుసుకోవాలి’ అని ఖాసిమ్‌ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. లెబనాన్‌ను అస్థిరత సుడిగుండంలోకి నెడుతున్న తమ ఘోర పాపం నుండి వెనక్కి తగ్గాలని ఆయన అధికారులకు పిలుపునిచ్చారు.

ఇజ్రాయిల్‌‌తో ప్రత్యక్ష చర్చల వల్ల లెబనాన్‌‌కు ఫలితాలు లేనట్లే ఉన్నాయి. ఈ చర్చలతో మాకెలాంటి సంబంధం లేదు. లెబనాన్, ఆ దేశ దాని ప్రజల కోసం మేము మా రక్షణాత్మక ప్రతిఘటనను కొనసాగిస్తాము అని నజీమ్‌ ‌ఖాసిమ్‌ ప్రకటనలో పేర్కొన్నారు. శత్రువు ఎంత బెదిరించినా మేము వెనకడుగు వేయము. తలవంచము, ఓటమిని అంగీకరించము అని ఆయన ఇజ్రాయిల్‌ చర్యలపై ధీటుగా స్పందించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -