Monday, April 27, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఫర్టిలైజర్ షాపుల బంద్ ప్రశాంతం

ఫర్టిలైజర్ షాపుల బంద్ ప్రశాంతం

- Advertisement -

ఫర్టిలైజర్ సమస్యలు పరిష్కరించాలని మండల వ్యవసాయ అధికారికి వినతి 
ఫర్టిలైజర్ అసోసియేషన్ నెల్లికుదురు మండల కమిటీ 
నవతెలంగాణ-నెల్లికుదురు

యూరియా కంపెనీలు డోర్ డెలివరీ ఎఫ్ఓఎల్ ఇవ్వనందున, బై ప్రోడక్ట్ లింక్ పెట్టడం వలన డీలర్లకు ఇబ్బంది జరుగుతుందని సంపూర్ణంగా బందును నిర్వహించినట్లు ఫర్టిలైజర్ అసోసియేషన్ నలుగురు మండల కమిటీ నాయకులు వేముల బాబ్జి పెరుమాల శంకర్ జయపాల్ రెడ్డి భక్తి రెడ్డి వాసు తెలిపారు. సోమవారం వారి అసోసియేషన్ జిల్లా ఆదేశాల మేరకు బంధు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..గతంలో ఆగ్రోసుకు సొసైటీలకు మార్క్ఫెడ్ క లారీ ట్రాన్స్పోర్ట్ ఖర్చు వారే భరించేదని గత రెండు సంవత్సరాల నుండి భరించకుండా ఉండడం వలన ఆ భారం నిర్వాహకులు పై పడుతుందని అన్నారు.

ఆ ఖర్చు ఒక బస్తా పై వేయడం వలన ఎంఆర్పి రేటు దాటిపోతుందని తెలిపారు. ఎమ్మార్పీ రేటుకు ఎక్కువ అమ్మడం కుదరదని ఒకవేళ అమ్ముతి చట్టమైన చర్యలు ఉంటాయని ఇటు రైతులు ఆందోళన చేపడుతున్నారని అన్నారు. దీనితో నిర్వాహకులు ఆయన డీలర్లు నష్టపోతున్నామని తెలిపారు. అంతేకాకుండా యూరియా బస్తాలకు భయపడకు లింకు పెట్టడం వలన అనేక ఇబ్బందులకు గురవుతున్నామని అన్నారు. లింకులు పెట్టడం వలన రైతులు తీసుకోవడం లేదని అవి మా పైన పడుతున్నాయని దీనివల్ల డీలర్లు లాస్ అవుతున్నామని అన్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి లారీ ట్రాన్స్పోర్ట్ కిరాయిలు చెల్లించి గత మాదిరిగానే మాకు సప్లై చేస్తూ ఈ బస్తాలు అమ్మిన లింకు లేకుండా ఉండే విధంగా ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని అన్నారు. అనంతరం సమస్యలు పరిష్కరించాలని మండల వ్యవసాయ అధికారికి వినతి పత్రాన్ని కూడా అందజేశామని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -