Monday, April 27, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఘనంగా బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు

ఘనంగా బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు

- Advertisement -

మండల శాఖ అధ్యక్షుడు పరుపాటి వెంకటరెడ్డి 
నవతెలంగాణ – నెల్లికుదురు 

మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం జెండాను ఆవిష్కరించినట్లు ఆ పార్టీ మండల అధ్యక్షుడు పరుపాటి వెంకటరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం తన ప్రాణాలను లెక్కచేయకుండా ఎన్నో ఉద్యమాలు చేపట్టి ఎంతో మంది నీ ఒప్పించి మెప్పించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేసిన గొప్ప వ్యక్తి అని అన్నారు. పేద బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టి నిరంతరం పేదల అభివృద్ధి కోసం కృషి చేస్తున్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షుడు గొట్టి ముక్కుల ఆదిరెడ్డి, నాయకులు పులి రామచంద్రు, బత్తిని అనిల్ గౌడ్, బోజ్య నాయక్, వరిపల్లి వెంకటేష్, కాసం వెంకటేశ్వర్ రెడ్డి, రహిమాన్ రమణ, సాయి, రాము, ప్రణీత్ ,తో పాటు కొంతమంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -