జాతీయ ఉపాధి హామీ పథకాన్ని యధావిధిగా కొనసాగించాలి
స్టేట్ కోఆర్డినేటర్స్ రాజశేఖర్ రెడ్డి, మహమ్మద్ జిలాని, మహమ్మద్ జానీ
నవతెలంగాణ-నెల్లికుదురు
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యధావిధిగా తక్షణమే అమలు చేయాలని స్టేట్ కోఆర్డినేటర్స్ రాజశేఖర్ రెడ్డి మహమ్మద్ జిలాని మహమ్మద్ జానీ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినట్లు తెలిపారు. సోమవారం నెల్లికుదురు కాచికల్ జామ తండా హనుమాన్ నగర్ తండా వస్త్రం తండా గ్రామాలలో పర్యటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (MGNREG S) పేరును మార్చడం, దానిని నిర్వీర్యం చేసేలా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా, ఈరోజు స్టేట్ కోఆర్డినేటర్స్..రాజశేఖర్ రెడ్డి,మహమ్మద్ జిలానీ, మహమ్మద్ జానీలు, నెల్లికుదురు, కచికల్, జమ తండా, హనుమాన్ నగర్ తండా, వాస్రంతండా గ్రామాలకి చేరుకొని ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని వాటి వల్ల జరిగే విషయాలపై కూలంకుషంగా వివరించినట్లు తెలిపారు.
గ్రామీణ ప్రాంత నిరుపేదల ఉపాధి హామీకి తీవ్ర విఘాతం కలిగించే ‘వికసిత్ భారత్ – గ్యారెంటీ ఫర్ రోజ్ గార్ ఆజీవికా మిషన్ (గ్రామీన్) వీబీ-జి రామ్ జీ చట్టం 2025’ ను నిర్ద్వందంగా తిరస్కరించాలని పేర్కొన్నారు. ఆ చట్టాన్ని తిరస్కరించి మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యథాతథంగా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎదళ్ళ యాదవ రెడ్డి, నెల్లికుదురు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గొల్లపల్లి ప్రభాకర్ గౌడ్, మాజీ జడ్పీటీసీ హెచ్ వెంకటేశ్వర్లు, నెల్లికుదురు సర్పంచ్ పులి వెంకన్న, గ్రామ పార్టీ అధ్యక్షులు, మండల పార్టీ నేతలు,గ్రామ ప్రజలు పాల్గొన్నారు.



