Saturday, June 27, 2026
E-PAPER
Homeజాతీయంప్రధాని మోడీ సీషెల్స్ పర్యటన

ప్రధాని మోడీ సీషెల్స్ పర్యటన

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్: ప్రధానమంత్రి మోడీ మూడు రోజుల పర్యటనకు గాను సీషెల్స్ దేశానికి బయల్దేరారు. సీషెల్స్ నేషనల్ డే ‘గోల్డెన్ జూబ్లీ’ వేడుకలకు మోదీ ‘గెస్ట్ ఆఫ్ ఆనర్’ గా హాజరవుతున్నారు. సీషెల్స్ కు బయల్దేరే ముందు ఎక్స్ వేదికగా మోడీ స్పందిస్తూ… “నా మిత్రుడు, సీషెల్స్ అధ్యక్షుడు డాక్టర్ పాట్రిక్ హెర్మినీ ఆహ్వానం మేరకు నేను జూన్ 27 నుంచి 29 వరకు సీషెల్స్‌లో పర్యటిస్తున్నాను” అని తెలిపారు.  “సీషెల్స్ అనేది కేవలం ఒక ద్వీప దేశం మాత్రమే కాదు. భారత రక్షణ రంగానికి అదొక కీలక సముద్ర దేశం. హిందూ మహాసముద్రంలో భద్రత, శాంతిని పెంపొందించడానికి భారత్ తెచ్చిన ‘విజన్ మహాసాగర్’ వ్యూహంలో సీషెల్స్ ఒక ప్రధాన భాగస్వామి” అని స్పష్టం చేశారు. ఈ పర్యటనలో భాగంగా అధ్యక్షుడు హెర్మినీతో మోదీ ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -