Friday, August 7, 2026
E-PAPER
Homeజాతీయంయూపీఐ‌పై చార్జీలు విధింపునకు ఓకే

యూపీఐ‌పై చార్జీలు విధింపునకు ఓకే

- Advertisement -

పేమెంట్స్ అండ్ సెటిల్‌మెంట్ సిస్టమ్స్ యాక్ట్‌‌కు సవరణ
లోక్‌‌సభలో మూజువాణి ఓటుతో బిల్లు పాస్‌
వినియోగదారులపై భారం : ప్రతిపక్షాలు

నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
యూపీఐ లావాదేవీలపై చార్జీలు విధించే బిల్లుకు లోక్‌సభ గురువారం ఆమోదం తెలిపింది. కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపితే, యూపీఐ లావాదేవీలపై రుసుములు వసూలు చేసేందుకు బ్యాంకులు, ఇతర సేవా సంస్థలకు ఈ బిల్లు అధికారం కల్పిస్తుంది. టాక్సేషన్ అండ్ అదర్ లాస్ (అమెండ్‌మెంట్‌) బిల్లు- 2026 పేరుతో రూపొందిన ఈ బిల్లును గురువారం లోక్‌స‌భ‌లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. పేమెంట్స్ అండ్ సెటిల్‌మెంట్ సిస్టమ్స్ చ‌ట్టం-2007 బిల్లు, ఇన్‌కం ట్యాక్స్ యాక్ట్-2025 బిల్లు, ఫైనాన్స్ యాక్ట్-2026ల‌కు స‌వ‌ర‌ణ చేసిన ఈ బిల్లును ప్రతిపక్షాల నిరసనల మధ్య లోక్‌సభ చర్చ లేకుండానే ఆమోదించింది. ఎటువంటి చ‌ర్చ లేకుండానే మూజువాణి ఓటుతో ఆమోదం పొందింది. ​యూపీఐ లావాదేవీలపై బ్యాంకులు, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్స్ చార్జీలు విధించేందుకు ఈ చట్టం అవకాశం కల్పిస్తుంది. దీనితో ఇప్పటివరకు యూపీఐ, ఇతర ఎలక్ట్రానిక్ పేమెంట్లపై వ్యాపారులకు బ్యాంకులు అందిస్తున్న మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్) రద్దవుతుంది.

ఇంతకుముందు ఆర్‌టీజీఎస్, నెఫ్ట్ లావాదేవీలపైనే చార్జీలు ఉండేవి. కానీ ఇప్పుడు యూపీఐ లావాదేవీల‌పై కూడా చార్జీలు విధించేందుకు మోడీ స‌ర్కార్ మార్గం సుగుమం చేసింది. యూపీఐ లావాదేవీలపై ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి చార్జీలు లేవు. కానీ, ఇకపై యూపీఐ లావాదేవీల‌పై కూడా చార్జీలు విధిస్తారు. ఏ తరహా పేమెంట్‌పై ఎంత చార్జి అనేది నోటిఫికేషన్ ద్వారా ప్రకటిస్తారు. బ్యాంకులకు, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్స్‌కు, పేమెంట్స్ విధానాన్ని నిర్వహించే సంస్థలకు స్థిరమైన ఆదాయం అందాలనే ఉద్దేశంతో ఈ చట్టం తీసుకొచ్చినట్టు కేంద్రం తెలిపింది. అయితే ప్ర‌తిప‌క్షాలు యూపీఐ వినియోగ‌దారుల‌పై భారం వేసేందుకే ఈ బిల్లు తీసుకొస్తున్నార‌ని విమ‌ర్శించాయి. ఇక ఈ బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందాలి. తరువాత‌ రాష్ట్రపతి ఆమోదంతో ఈ బిల్లు చట్టంగా అమలులోకి వస్తుంది. మ‌రోవైపు రాజ్య‌స‌భ‌లో అప్రిపియేష‌న్ బిల్లును ఆమోదించారు.

​12న ఎఫ్‌సీఆర్‌ఏ బిల్లు వచ్చే అవకాశం
మైనారిటీలను లక్ష్యంగా చేసుకున్న ఎఫ్‌సీఆర్ఏ సవరణ బిల్లును ఈ నెల 12వ తేదీన పార్లమెంటులో చర్చకు పెట్టే అవకాశం ఉంది. ఈ బిల్లును బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టినప్పటికీ, తీవ్ర నిరసనల కారణంగా వాయిదా పడింది. గురువారం, క్యాథలిక్ బిషప్స్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఇండియా (సీబీసీఐ) ప్రతినిధి బృందం హోం మంత్రి అమిత్ షాను కలిసి, ఎఫ్‌సిఆర్ఎ బిల్లుపై మరోసారి తీవ్ర ఆందోళనలను వ్యక్తం చేసింది. కొన్ని వారాల క్రితం, సీబీసీఐ బృందం అమిత్ షాను కలిసి ఆందోళనలను లేవనెత్తింది. అప్పుడు అమిత్ షా, ఈ బిల్లు మైనారిటీలను లక్ష్యంగా చేసుకుంటోందన్న ఆరోపణలు నిరాధారమైనవని పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -