Tuesday, April 28, 2026
E-PAPER
Homeసినిమాఆద్యంతం వినోదభరితం

ఆద్యంతం వినోదభరితం

- Advertisement -

తరుణ్‌ భాస్కర్‌, రైటర్‌- డైరెక్టర్‌ కశ్యప్‌ శ్రీనివాస్‌ కాంబోలో రాబోతున్న చిత్రం ‘గాయపడ్డ సింహం’. హీరో శ్రీవిష్ణు ఇందులో స్పెషల్‌ రోల్‌ చేస్తున్నారు. పవన్‌ సాధినేని సమర్పణలో కళ్యాణ చక్రవర్తి మంథిన, భాను కిరణ్‌ ప్రతాప, విజయ్ కృష్ణ లింగమనేని, ఉమేష్‌ బన్సల్‌ సప్తస్వ మీడియా వర్క్స్‌, పిఓవి స్టోరీస్‌, జీ స్టూడియోస్‌ బ్యానర్ల పై నిర్మించారు. ఫరియా అబ్దుల్లా, మానస చౌదరి కథానాయికలు. జేడి చక్రవర్తి కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా మే 1వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్‌ ఫరియా అబ్దుల్లా మీడియాతో ముచ్చటించారు.ఇందులో నేను ఒక మంచి క్యామియో రోల్‌ చేశాను. నా పాత్ర పేరు శాలిని. తను ఒక వ్లాగర్‌. ఇందులో తరుణ్‌తో ఒక రొమాంటిక్‌ ట్రాక్‌ కూడా ఉంటుంది. డైరెక్టర్‌ కశ్యప్‌ చాలా డిఫరెంట్‌గా రాశారు. ఆయన క్రియేట్‌ చేసిన యూనివర్సల్ క్యారెక్టర్స్‌ అన్నీ చాలా హిలేరియస్‌గా వచ్చాయి.మల్టిపుల్‌ లేయర్స్‌లో జరిగే కథ ఇది. ప్రతి పాత్రకి ప్రాముఖ్యత ఉంటుంది. సినిమా చూసిన ఆడియన్స్‌కి మళ్లీ చూడాలని అనిపిస్తుంది. ఫైనల్‌ అవుట్‌పుట్‌ చూశాను. చాలా అద్భుతంగా వచ్చింది. ఖచ్చితంగా హిట్‌ అవుతుందని నమ్మకం ఉంది. ఇందులో శ్రీ విష్ణు క్యారెక్టర్‌ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఆ పాత్రను చాలా బాగా డిజైన్‌ చేశారు. దర్శకుడు కశ్యప్‌ కామెడీ టైమింగ్‌ చాలా పెక్కులర్‌గా ఉంటుంది. ఈ సినిమాలో యాక్షన్‌, రొమాన్స్‌, కామెడీ ఇలా అన్ని ఎలిమెంట్స్‌ను కలిపి హిలేరియస్‌గా తెరకెక్కించారు. ఆయన ఈ సినిమాలో ఒక క్యారెక్టర్‌ కూడా చేశారు. స్వీకర్‌ అగస్తి చాలా బ్యూటీఫుల్‌ మ్యూజిక్ ఇచ్చారు. ఈ చిత్రానికి నలుగురు నిర్మాతలు ఉన్నారు. అందరూ చాలా క్రియేటివ్‌గా ఆలోచించే వారే. అందుకే అవుట్‌ఫుట్‌ చాలా బాగా వచ్చింది. నెక్స్ట్‌ ఇయర్‌ డైరెక్షన్‌కి ప్లాన్‌ చేస్తున్నాను. కొన్ని కథలు రాస్తున్నాను.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -