Tuesday, April 28, 2026
E-PAPER
Homeసినిమాప్రేక్షకులను థ్రిల్‌ చేసే ఓల్డ్‌ మ్యాన్‌.. యంగ్‌ గర్ల్‌ కాన్సెప్ట్‌

ప్రేక్షకులను థ్రిల్‌ చేసే ఓల్డ్‌ మ్యాన్‌.. యంగ్‌ గర్ల్‌ కాన్సెప్ట్‌

- Advertisement -

విలక్షణ నటుడు జగపతి బాబు సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ‘వదలా’తో రాబోతున్నారు. లయ, హతికా శ్రీనివాస్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అకెళ్ల వి కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని చరిత చిత్ర ప్రొడక్షన్‌ బ్యానర్‌ పై కిషోర్‌ నాయుడు చిరుమమిల్ల, తమ్మారెడ్డి భరద్వాజ్‌ నిర్మించారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌తో ఆసక్తిని రేకెత్తించిన టీం, ఇప్పుడు థ్రిల్లింగ్‌ టీజర్‌ని లాంచ్‌ చేశారు. ఈ టీజర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో హీరో జగపతి బాబు మాట్లాడుతూ, ‘ఆర్టిస్టులు, టెక్నీషియన్స్‌, యూనిట్ అందరూ బంగారంలాంటి వారు. ఎక్కడా ఎవరికీ ఇబ్బంది లేకుండా అందరూ ఎంజారు చేస్తూ ఒక థ్రిల్లర్‌ను అద్భుతంగా తీర్చిదిద్దాం.చోటా కె. నాయుడు ఈ సినిమా కోసం ప్రత్యేకంగా సమయం కేటాయించి అద్భుతమైన విజువల్స్‌ ఇచ్చారు. ఈ క్వాలిటీకి ప్రధాన కారణం ఆయనే. బంగారంలాంటి సినిమాను మీకు అప్పగిస్తున్నాం. దీన్ని కల్తీ చేయకుండా బాగా చూడాలి (నవ్వుతూ). లయతో ‘మనోహరం’ నుంచి నా జర్నీ ఉంది. ఈ సినిమాలో ఆమె చాలా డిఫరెంట్‌గా పెర్ఫార్మ్‌ చేసింది. ఫస్ట్‌ కాపీ చూసిన నిర్మాత కిషోర్‌, ఈ సినిమాను తొందరపడి ఎవరికీ అమ్మొద్దు… ఇది కనీసం 45–50 కోట్లు చేస్తుంది అని నమ్మకం వ్యక్తం చేశారు.

ఖచ్చితంగా అలాంటి విజయం వస్తుందని నమ్ముతున్నాను. ఈ రోజుల్లో ఒక సినిమా హిట్‌ కావాలంటే ఒక సాలిడ్‌ ఎలిమెంట్‌ ఉండాలి. ‘ఓల్డ్‌ మాన్‌.. యంగ్‌ గర్ల్‌’ కాన్సెప్ట్‌తో మంచి థ్రిల్లర్‌గా ఈ సినిమాను తీర్చిదిద్దాం. ఇందులో చాలా మంచి ట్విస్టులు ఉంటాయి’ అని తెలిపారు. ‘టీజర్‌ చాలా థ్రిల్లింగ్‌గా అనిపించింది. నటించినప్పుడు కంటే ఇప్పుడు చూస్తున్నప్పుడు ఇంకా పవర్‌ఫుల్‌గా, డెప్త్‌ ఉన్న సినిమాలా అనిపించింది. వెంటనే పూర్తి సినిమా చూడాలనిపించింది. జగపతి బాబుతో మళ్లీ కలిసి నటించడం చాలా ఆనందంగా ఉంది. భరద్వాజతో కలిసి చాలా సినిమాలు చేశాను, కానీ ఈ సినిమా చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. కిషోర్‌ చాలా పాజిటివ్‌ పర్సన్‌. డైరెక్టర్‌ వంశీకి థ్యాంక్స్‌’ అని హీరోయిన్‌ లయ చెప్పారు. డైరెక్టర్‌ వంశీకష్ణ ఆకెళ్ళ మాట్లాడుతూ,’ఈ సినిమా ఐడియా జగపతి బాబుదే. ఆయన ఐడియాపై నేను వర్క్‌ చేశాను. చోటా లేకపోతే ఈ సినిమా ఉండేది కాదు.

ఆయన విజువల్స్‌ ఎక్స్‌ట్రార్డినరీ. కిషోర్‌ చాలా జెన్యూయిన్‌ పర్సన్‌. లయ, హతిక ఇద్దరూ కెరీర్‌లోనే బెస్ట్‌ పెర్ఫార్మెన్స్‌ ఇచ్చారు. ఇద్దరూ పోటీగా నటించారు. కార్తీక్‌ మంచి వ¶్యజిక్‌ ఇచ్చారు’ అని అన్నారు. నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ,’జగపతి బాబు ఇన్‌వాల్వ్‌మెంట్‌ గురించి ఎంత చెప్పినా తక్కువే. స్క్రిప్ట్‌ స్టేజ్‌ నుంచి ఫైనల్‌ వరకు ఆయన ఎంతో సహకారం అందించారు. చోటా అద్భుతమైన విజువల్స్‌ ఇచ్చారు. ఎడిటర్‌ కోటగిరి వెంకటేశ్వరరావు కూడా ఎంతో కష్టపడ్డారు. హతిక ఈ సినిమాలో భయపెట్టేసింది. లయ అద్భుతంగా నటించింది. డైరెక్టర్‌ వంశీ సినిమాను చాలా చక్కగా తీశాడు’ అని అన్నారు. ‘ఈ సినిమాతో నేను ఎంతో మంది మంచి మనుషులను సంపాదించుకున్నాను. హతిక, లయ చాలా సపోర్ట్‌ చేశారు. జగపతి బాబు ప్రొడ్యూసర్‌ ఫ్రెండ్లీ హీరో. చోటా హాలీవుడ్‌ రేంజ్‌ డీఓపీ. ఆయన వల్లే మా సినిమా రేంజ్‌ పెరిగింది. డైరెక్టర్‌ వంశీతో పని చేయడం మంచి అనుభవం. భరద్వాజతో పని చేసిన తర్వాత ఆయన ఎనర్జీ చూసి ఆశ్చర్యపోయాను. ఈ సినిమా సక్సెస్‌తో మీ రుణం తీర్చుకుంటామని నమ్ముతున్నాను’ అని నిర్మాత కిషోర్‌ నాయుడు చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -