Tuesday, April 28, 2026
E-PAPER
Homeసినిమా'కర'.. అద్భుతాలు సృష్టించడం ఖాయం : హీరో ధనుష్‌

‘కర’.. అద్భుతాలు సృష్టించడం ఖాయం : హీరో ధనుష్‌

- Advertisement -

ధనుష్‌, మమితా బైజు జంటగా కుష్మిత గణేష్‌ సమర్పణలో డా. ఐషరి కె. గణేష్‌ నిర్మించిన చిత్రం ‘కర’. విఘ్నేశ్‌ రాజా దర్శకత్వం వహించారు. ఈ సినిమాని ఈనెల 30న విఘ్నేశ్వర ఎంటర్టైన్మెంట్స్‌, ఆర్‌ స్టార్‌ లాజిస్టిక్స్‌ తెలుగులో రిలీజ్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను మేకర్స్‌ ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు హీరో సాయి దుర్గ తేజ్‌, దర్శకులు బుచ్చిబాబు సానా, వెంకీ అట్లూరి ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ ఈవెంట్‌లో ధనుష్‌ మాట్లాడుతూ, ”కర’ అనేది ఓ సాధారణ యువకుడి కథ. విఘ్నేశ్‌ లాంటి ఓ గొప్ప వ్యక్తి నుంచి ఈ కథ వచ్చింది. ఈ సినిమా అద్భుతాలు సష్టిస్తుంది. ఈ మూవీకీ సపోర్ట్‌ చేసిన గణేష్‌కి థ్యాంక్స్‌. మమిత అద్భుతమైన నటి. రవి కుమార్‌తో పని చేయడం ఎప్పుడూ సరదాగా ఉంటుంది. నా ఫ్రెండ్‌ జీవీ నాకు ఎప్పుడూ మంచి మ్యూజిక్ ఇస్తుంటారు. ‘కుబేర’, ‘ఇడ్లీకొట్టు’ తరువాత మళ్లీ తెలుగు ఆడియెన్స్‌ ముందుకు వస్తున్నాను.

‘కర’ ఎంతో క్వాలిటీతో రాబోతోంది’ అని తెలిపారు. ‘వేల్స్‌ తరుపున గణేష్‌ చేసే సేవా కార్యక్రమాల గురించి నాకు తెలుసు. విఘ్నేశ్‌ తీసిన ‘పోరు తొళిల్‌’, జీవీ ప్రకాష్‌ మ్యూజిక్ మమిత వర్కింగ్‌ నాకు ఇష్టం. నా జీవితంలోని ప్రేమ కథలకు ధనుష్‌ లవ్‌ సాంగ్స్‌కి చాలా కనెక్షన్‌ ఉంది. ‘3’, ‘ఆడుకాలం’ ఇలా ప్రతీ సినిమా, అందులోని పాటలు నా మీద ప్రభావం చూపించాయి. ధనుష్‌ ఎక్స్‌ప్రెషన్స్‌ అద్భుతంగా ఉంటాయి. సతీష్‌, రాజేష్‌కి ఈ మూవీతో లాభాలు రావాలి’ అని హీరో సాయి దుర్గ తేజ్‌ చెప్పారు. దర్శకులు బుచ్చిబాబు సానా మాట్లాడుతూ, ‘కాళీపట్నంలో కర మాస్టర్‌ అని ఉండేవారు. ఆయన రచయితల కోసం ఎన్నో చేశారు. ఆయన పేరు ఈ మూవీకి పెట్టారు’ అని అన్నారు. మరో దర్శకుడు వెంకీ అట్లూరి మాట్లాడుతూ, ‘టీజర్‌, ట్రైలర్‌ నాకు చాలా నచ్చాయి. తెలుగు ఇండిస్టీలోకి వస్తున్న గణేష్‌కి థ్యాంక్స్‌. ధనుష్‌తో చేసిన ‘సార్‌’ వల్లే నాకు ఇంతటి ప్రేమ, అభిమానం దక్కాయి. ‘కర’ తెలుగులో అద్భుతం చేస్తుందని నమ్ముతున్నాను. ‘సార్‌’ కంటే భారీ హిట్‌ అవ్వుతుంది’ అని తెలిపారు. ”పోరుతొళిల్‌’ సినిమా చూసి తెలుగు ఆడియెన్స్‌ నన్నెంతో ప్రశంసించారు. అదే స్పిరిట్‌తో ఈ మూవీని తీశాను. ఇది మీరు పెట్టే డబ్బు, మీ సమయం అన్నింటినీ గౌరవించేలా ఉంటుంది’ అని దర్శకుడు విఘ్నేశ్‌ రాజా చెప్పారు.

నిర్మాత గణేష్‌ మాట్లాడుతూ, ‘విఘ్నేశ్‌ ఆల్రెడీ మాకు మంచి మూవీని ఇచ్చారు. ఇప్పుడు ఈ ‘కర’ కూడా మంచి విజయం సాధిస్తుంది’ అని తెలిపారు. ‘మా ‘కర’ మూవీని తెలుగులో రిలీజ్‌ చేస్తున్న సతీష్‌, రాజేష్‌కి థ్యాంక్స్‌. మాకు ఈ జర్నీలో సపోర్ట్‌ చేసిన విఘ్నేశ్‌కి, ధనుష్‌కి, మమితకి థ్యాంక్స్‌’ అని నిర్మాత కుష్మిత గణేష్‌ అన్నారు. ‘నాకు ‘కర’ మూవీని తెలుగులో రిలీజ్‌ చేసే అవకాశాన్ని ఇచ్చిన గణేష్‌, ధను ష్‌కి థ్యాంక్స్‌. ఫ్యామిలీ ఎమోషన్స్‌తో రానున్న ఈ మూవీ మంచి విజయాన్ని సాధిస్తుంది. మా కోసం వచ్చిన సాయి దుర్గ తేజ్‌కి, ఈ జర్నీలో నాకు సపోర్ట్‌ చేస్తున్న నా ఫ్రెండ్‌ ఆర్‌ స్టార్‌ లాజిస్టిక్‌ రాజేష్‌కి కృతజ్ఞతలు’. విఘ్నేశ్వర ఎంటర్టైన్మెంట్స్‌ అధినేత సతీష్‌ కుమార్‌

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -