వెంకటేష్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ వంటి క్రేజీ కాంబోలో వస్తోన్న కుటుంబ కథా చిత్రం ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం: 47 – ఏకే47` విడుదల తేదీ ఖరారైంది. ఈ చిత్రాన్ని అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో భారీస్థాయిలో విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.
ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ సినిమాలోని హృద్యమైన, ఉత్సాహ భరితమైన ప్రపంచాన్ని పరిచయం చేస్తోంది. ఇందులో వెంకటేష్, శ్రీనిధి శెట్టి ఎంతో హుందాగా, ఆకర్షణీయంగా కనిపిస్తూ, ఆత్మీయ కుటుంబ కథకు అద్దం పట్టేలా ఉన్నారు. ఈ చిత్రం భావోద్వేగాలు, వినోదం, హృదయాన్ని హత్తుకునే క్షణాలతో నిండిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతుందని పోస్టర్ స్పష్టం చేస్తోంది.
వెంకటేష్, త్రివిక్రమ్ కలయికలో వస్తున్న సినిమా కావడంతో ప్రకటన వచ్చినప్పటి నుంచే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. త్రివిక్రమ్ శైలిలో మనసును హత్తుకునే భావోద్వేగాలు, గుర్తుండిపోయే పాత్రలు, కట్టిపడేసే హాస్యం, అర్థవంతమైన కథనం కలగలిపి, ప్రేక్షకులకు సంపూర్ణ మైన సినిమా అనుభూతిని అందించడానికి ఈ సినిమా సిద్ధమవుతోంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత ఎస్. రాధాకృష్ణ (చినబాబు) ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
‘ఆదర్శ కుటుంబం..` రిలీజ్ డేట్ ఫిక్స్
- Advertisement -
- Advertisement -



