- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన ‘తెలంగాణ ప్లాట్‌ఫామ్ బేస్డ్ గిగ్ వర్కర్స్-2026 బిల్లు’కు గవర్నర్ శివ్‌ప్రతాప్ శుక్లా ఆమోదం తెలిపారు. మేడే సందర్భంగా ఇవాళ గెజిట్ నోటిఫికేషన్ వెలువడనుంది. ఈ బిల్లు ద్వారా డెలివరీ బాయ్స్, క్యాబ్ డ్రైవర్లు వంటి అసంఘటిత రంగంలోని లక్షలాది మంది కార్మికులకు పని భద్రత, ప్రమాద, ఆరోగ్య బీమా, ఇతర సామాజిక భద్రతా పథకాలు వర్తింపజేయడానికి మార్గం సుగమం కానుంది. రాబోయే 10-15 రోజుల్లో దీనికి సంబంధించిన పూర్తి మార్గదర్శకాలు విడుదల కానున్నాయి.
- Advertisement -



