- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : అంతర్జాతీయ కార్మిక దినోత్సవం (మే డే) సందర్భంగా మాజీ సీఎం కేసీఆర్ కార్మిక, కర్షక లోకానికి శుభాకాంక్షలు తెలిపారు. ఉత్పత్తి రంగంలో భాగమై దేశ సంపదను సృష్టిస్తున్న కార్మికుల రెక్కల కష్టం, వారి త్యాగాలు అమూల్యమైనవని కొనియాడారు. చారిత్రాత్మక మే డే స్ఫూర్తితో బీఆర్ఎస్ ప్రభుత్వం, సబ్బండ కులాల కర్షక, కార్మికుల సంక్షేమం కోసం అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను, ఆదర్శవంతమైన పారిశ్రామిక విధానాలను అమలు చేసిందని అన్నారు.
- Advertisement -



