ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై ‘సమ్మర్ హాలిడేస్అనే చిల్డ్రన్ మూవీని ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ ధీరజ్ మొగిలినేని త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. " శ్రీకర్ దర్శకుడు. మాస్టర్ రోహన్, మాస్టర్ అరుణ్, బేబి ఖుషి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ కు రెడీ అవుతోంది. బుధవారం ఈ చిత్రం నుంచి క్రష్ సాంగ్ ను హీరో ఆనంద్ దేవరకొండ, డైరెక్టర్ ఆదిత్య హాసన్, ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్ లాంచ్ చేశారు. డైరెక్టర్ శ్రీకర్ మాట్లాడుతూ,'మా టీమ్ అంతా కలిసి ఈ పాటను అందంగా డిజైన్ చేశాం. సింజిత్ ఈ సాంగ్ ని బ్యూటిఫుల్ గా కంపోజ్ చేశాడు. ఈ పాటను కిట్టునే రాయగలడు అనేంత బాగా రాశాడు. అలాగే అనురాగ్ కులకర్ణి అద్భుతంగా పాడారు అని తెలిపారు. ‘శ్రీకర్ ఈ కథ చెప్పినప్పుడు చాలా హ్యాపీగా ఫీలయ్యా. ఒక మంచి మూవీ చేశామని మీ అందరితో అనిపించుకుంటాం. సింజిత్ మ్యూజిక్ చేయకుంటే ఈ పాటలు ఇంత బాగా వచ్చేవి కావేమో. ఆయన మూడు పాటలు ఛాట్ బస్టర్స్ ఇచ్చారు. కిట్టు విస్సాప్రగడ గతంలో మా సినిమాలకు వర్క్ చేశారు. ఈ పాటను అందంగా రాశారుఅని ప్రొడ్యూసర్ ధీరజ్ మొగిలినేని చెప్పారు. ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్ మాట్లాడుతూ,'బాలల చిత్రాలు రావడం తగ్గిపోయింది. మా ధీరజ్ ఆ జోనర్ లో సినిమా చేయడం హ్యాపీగా ఉంది అని చెప్పారు.
మెప్పించే బాలల చిత్రం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



