జిఎంబి ఎంటర్‌టైన్‌మెంట్ అధినే తలు మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్ సమర్పణలో రాబోతున్న సినిమా ‘రావు బహదూర్. వెంకటేష్ మహా దర్శకత్వంలో సత్యదేవ్ హీరోగా నటించిన సైకలాజికల్ థ్రిల్లర్ ఇది. ఈ చిత్రాన్ని ఏ+ఎస్ మూవీస్, శ్రీ చక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్ పై చింతా గోపాలకృష్ణ రెడ్డి, అను రాగ్ రెడ్డి, శరత్ చంద్ర నిర్మించారు. ఈ చిత్రం ఈనెల 3న విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో సత్యదేవ్ మీడియాతో పలు సినీ విశేషాలను షేర్ చేసుకున్నారు. మా సినిమాపై టీమ్ అందరూ ఎంతో నమ్మకంతో ఉన్నారు. ఇది సినిమా చూసిన తర్వాత వచ్చిన నమ్మకం. మేము సినిమా మొదలు పెట్టినప్పుడు 'మునుపెన్నడూ చూడని విధంగా తెలుగు సినిమా అనే ట్యాగ్‌లైన్‌ను అనుకున్నాం. మహేష్ బాబు ఈ సినిమా చూసిన తర్వాత కూడా అదే ట్యాగ్‌లైన్ చెప్పారు. ఇప్పటివరకు సినిమా చూసిన ఫిలిం మేకర్స్ కూడా ఇదే చెప్పారు. ఇది కంప్లీట్ సైకలాజికల్ డ్రామా. మ్యాజికల్ రియలిజం, డార్క్ కామెడీ సబ్‌జోనర్స్‌గా ఉంటాయి. ఈ కథ అనుకున్నప్పుడే నా క్యారె క్టర్ మేకప్ చాలా ఛాలెం జింగ్‌గా ఉంటుందని అనుకున్నా. కమల్ హాసన్, సూర్య, విక్రమ్ ఇలాంటి హెవీ మేకప్ సినిమాలు ప్రయత్నిస్తుంటారు. నేను కూడా ఎప్పుడైనా అలాంటి సినిమా చేయా లని అనుకునేవాడిని. అది నా డ్రీమ్. ఆ అవకాశం ఈ సినిమాతో రావడం చాలా హ్యాపీగా ఉంది. మొన్నటి వరకు నా కెరీర్‌లో ‘జ్యోతిలక్ష్మి’కి ముందు, తర్వాత అని చూసుకునేవాడిని. ఇప్పుడు ‘రావు బహదూర్’కి ముందు, తర్వాత అన్నట్టుగా చూస్తారని గట్టిగా నమ్ము తున్నాను. 1960–99 మధ్య జరిగే కథ. ఇందులో కథానాయకుడు దేశ సంచారి. తను సంచారం చేస్తూ మళ్లీ తన ప్యాలెస్ కి వచ్చినప్పుడు ఎలాంటి సంఘటనలు చోటు చేసుకుంటాయనేది ఆసక్తికరం.
‘రావు బహదూర్`తోనా కల నెరవేరింది
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



