Saturday, May 2, 2026
E-PAPER
Homeక్రైమ్ప్రియుడు మోసం చేశాడని యువతి ఆత్మహత్యాయత్నం

ప్రియుడు మోసం చేశాడని యువతి ఆత్మహత్యాయత్నం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : నిజామాబాద్ జిల్లా బాల్కొండలో ఓ యువతి ఏకంగా పోలీస్ స్టేషన్‌పై నుంచే దూకి ఆత్మహత్యకు యత్నించింది. ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. బాల్కొండకు చెందిన సాయికుమార్‌తో ఓ యువతి కొన్నేళ్లుగా ప్రేమలో ఉంది. అయితే సాయికుమార్ గతంలోనే తనకు పెళ్లయ్యిందనే విషయాన్ని దాచిపెట్టి ఆమెకు దగ్గరయ్యాడు. ఇటీవల సాయికుమార్‌కు పెళ్లయ్యిందన్న సంగతి తెలియడంతో యువతి తీవ్ర మనస్తాపం చెందింది. అతనిపై బాల్కొండ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. అనంతరం అదే స్టేషన్ భవనంపై నుంచి కిందకు దూకేసింది. తీవ్రంగా గాయపడిన ఆమెను పోలీసులు వెంటనే ఆస్పత్రికి తరలించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -