- Advertisement -
శాన్‌ఫ్రాన్సిస్కో (యుఎస్‌ఏ) : ఆతిథ్య అమెరికా ఫిఫా ప్రపంచకప్‌లో అదరగొడుతోంది. గురువారం జరిగిన రౌండ్ ఆఫ్ 32 మ్యాచ్‌లో బోస్నియాపై 2-0తో అదిరే విజయం సాధించింది. ప్రీ క్వార్టర్‌ఫైనల్లో బెల్జియంతో సమరానికి రంగం సిద్ధం చేసుకుంది. రెడ్ కార్డ్‌తో పది మందికి పరిమితమైన అమెరికాకు 45వ నిమిషంలో బాలోగన్ గోల్ అందించగా, 82వ నిమిషంలో టిల్‌మాన్ గోల్ కొట్టాడు. దీంతో అమెరికా 2-0తో అలవోకగా బోస్నియాను బోల్తాకొట్టించింది.
- Advertisement -



