సహాన్ అజేయ అర్థ సెంచరీభారత్-ఏతో రెండో అనధికార టెస్టు
గాలె (శ్రీలంక) : భారత్-ఏ, శ్రీలంక-ఏ జట్ల తొలి అనధికార టెస్టు డ్రాగా ముగియగా.. రెండో అనధికార టెస్టులో ఆతిథ్య జట్టు మంచి ఆరంభం దక్కించుకుంది. గాలెలో రెండో అనధికార టెస్టు గురువారం నుంచి ఆరంభం కాగా.. శ్రీలంక-ఏ తొలి ఇన్నింగ్స్‌లో 85 ఓవర్లలో 5 వికెట్లకు 288 పరుగులు చేసింది. టాప్-4 బ్యాటర్లకు శుభారంభం దక్కినా.. ఎవరూ అర్థ సెంచరీలు సాధించలేదు. పవనంత (39), సోహాన్ (28), ఫెర్నాండో (44), ఆషెన్ బందెర (34)లు రాణించారు. సహాన్ (83 నాటౌట్,
148 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్) కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. అంజల బందెర (42, 96 బంతుల్లో 3 ఫోర్లు)తో కలిసి సహాన్ విలువైన భాగస్వామ్యం నిర్మించాడు. భారత-ఏ బౌలర్లు రోజంతా చెమటోడ్చి ఐదు వికెట్లు పడగొట్టారు. సరాన్షు జైన్ (2/77), యశ్ ఠాకూర్ (2/32), గుర్నూర్ బరార్ (1/49) వికెట్లు పడగొట్టారు.
శ్రీలంక-ఏ 288/5
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



