‘విసా– వింటారా సరదాగా’ చిత్ర బృందం రెండో గీతం ‘చింగారి’ని విడుదల చేసింది. హృదయాన్ని హత్తుకునే బాణీలు అందించడంలో పేరొందిన విజయ్ బుల్గానిన్ అద్భుతమైన సంగీతాన్ని సమకూర్చిన ఈ మెలోడీ గీతాన్ని తన ప్రత్యేకమైన గానంతో శ్రోతలను అలరించే సిద్ శ్రీరామ్, లిప్సిక ఎంతో అందంగా ఆలపించారు. సనారే రచించిన ఈ పాట ప్రతి ఒక్కరి గుండెల్ని తాకేలా ఉంది. ప్రేమలోని నిశ్శబ్ద వేదనను, మనసులో రగిలే భావోద్వేగాలను ఎంతో కవితాత్మకంగా ఆవిష్కరించింది. మాటల్లో చెప్పలేని ప్రేమ అనుభూతిని సంగీతం ద్వారా అద్భుతంగా వ్యక్తపరిచే ఈ పాట ప్రతి ఒక్కరికీ దగ్గరయ్యేలా రూపొందింది అని చిత్ర యూనిట్ తెలిపింది. ఈ చిత్రం ప్రతి అప్‌డేట్‌తో ప్రేక్షకుల్లో అంచనాలను భారీగా పెంచుతోంది. ఈ చిత్ర టీజర్ ఒక సరికొత్త కథనంతో, విదేశాల్లోని తెలుగు విద్యార్థుల జీవితాన్ని ఆవిష్కరిస్తూ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. తొలి గీతం ‘అనగనగా అమెరికా’ ఒక హుషారైన పాటగా నిలిచి, అన్ని వేదికల్లో అందరి మనసులను గెలుచుకుంది. సొంత ఊరిని వదిలి దూరంగా వెళ్ళి, విదేశాల్లో తమ కలలను సాకారం చేసుకునేందుకు ప్రయత్నించే యువత భావోద్వేగాలను ప్రతిబిం బించే చిత్రంగా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి.
నూతన దర్శకుడు ఉద్భవ్ రఘు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో అశోక్ గల్లా, శ్రీ గౌరీ ప్రియ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. రాహుల్ విజయ్, శివాత్మిక రాజశేఖర్, సత్య, వైవా హర్ష, గుండు సుదర్శన్ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
విదేశాల్లో తెలుగు విద్యార్థుల జీవితం నేపథ్యంలో..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


