వర్ధన్, కృష్ణప్రియ హీరో, హీరోయిన్లుగా ఎంజీఆర్ తుకారాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘కాగితం పడవలు’. ఎస్ఎల్ఎన్ సినీ క్రియేషన్స్, ప్రణధి క్రియేషన్స్, నవ నారాయణ సినీ క్రియేషన్స్ బ్యానర్స్ పై కీర్తన నరేష్ టీ.ఆర్. ప్రసాద్ రెడ్డి వెంకట్రాజుల, గాయిత్రమ్మ అంజనప్ప నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, ట్రైలర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా చిత్ర బృందం విడుదల తేదీని అధికారికంగా ప్రకటించింది. ఈనెల 24న ఈ చిత్రం ఏషియన్ సురేష్ ఎంటర్ టైన్‌మెంట్ ద్వారా గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రతిష్టాత్మకమైన పంపిణీ సంస్థల్లో ఒకటైన ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ ఈ చిత్రాన్ని విడుదల చేస్తుండటం విశేషం. ఒక సినిమా కంటెంట్‌పై బలమైన నమ్మకం ఉన్నప్పుడే ఇలాంటి ప్రముఖ సంస్థలు ముందుకు వస్తాయి. దీంతో ‘కాగితం పడవలు’ పై పరిశ్రమ వర్గాల్లోనూ, ప్రేక్షకుల్లోనూ మరింత ఆసక్తి నెలకొంది. ఇదొక అందమైన ప్రేమకథగా అందర్నీ కచ్చితంగా అలరిస్తుందనే నమ్మకంతో ఉన్నాం అని మేకర్స్ తెలిపారు. వర్ధన్, కృష్ణప్రియ జంటగా నటిస్తున్న ఈ సినిమాకి రచన, దర్శకత్వం: ఎంజీఆర్ తుకారాం, నిర్మాతలు: కీర్తన నరేష్, టీ.ఆర్. ప్రసాద్ రెడ్డి వెంకట్రాజుల, గాయిత్రమ్మ అంజనప్ప, సంగీతం : ఏఐఎస్ నౌఫల్ రాజా, డీవోపీ: రుద్రసాయి, ఎడిటర్: జెస్విన్ ప్రభు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎం.హిమ బిందు, సాహిత్యం: రెహమాన్.
అందమైన ప్రేమకథతో ‘కాగితం పడవలు’
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



