Thursday, August 13, 2026
E-PAPER
Homeతాజా వార్తలుమీ మొబైల్ ద్వారా క్షణాల్లో రేషన్ కార్డు ఈ-కేవైసీ చేయొచ్చు!

మీ మొబైల్ ద్వారా క్షణాల్లో రేషన్ కార్డు ఈ-కేవైసీ చేయొచ్చు!

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : దేశవ్యాప్తంగా రేషన్ కార్డు కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఈకేవైసీ పూర్తి చేయాలని ప్రభుత్వం సూచించింది. ఈ ప్రక్రియను మొబైల్ ఫోనులో ఆధార్ ఫేస్ ఆర్డీ, మేరా ఈకేవైసీ యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకుని సులభంగా పూర్తి చేసుకోవచ్చు. మేరా ఈకేవైసీ యాప్‌లో రాష్ట్రం ఎంపిక చేసుకుని ప్రోసీడ్‌పై క్లిక్ చేయండి. ఆధార్ నంబర్ నమోదు చేసి, ఓటీపీ ద్వారా ధృవీకరణ పొందాలి. అనంతరం క్యాప్చా నమోదు చేస్తే, సభ్యుల వివరాలు కనిపిస్తాయి. అనంతరం ఫేస్ ఈకేవైసీ బటన్‌పై క్లిక్ చేయాలి. కెమెరాలో ముఖాన్ని చూపించడం ద్వారా ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేసినట్లు స్క్రీన్‌పై మెస్సేజ్ కనిపిస్తుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -