Wednesday, September 23, 2026
E-PAPER
Homeతాజా వార్తలుకేసీఆర్ బంధువు జోగినపల్లి శ్రీనివాస్ మృతి..

కేసీఆర్ బంధువు జోగినపల్లి శ్రీనివాస్ మృతి..

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : కేసీఆర్ బావమరిది, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు సమీప బంధువైన జోగినపల్లి శ్రీనివాస్ రావు అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా అస్వస్థతతో బాధపడుతున్న ఆయన సికింద్రాబాద్‌లోని యశోద హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. శ్రీనివాస్ రావు మరణవార్త తెలిసిన వెంటనే ఎర్రబెల్లి దయాకర్ రావు హుటాహుటిన యశోద ఆస్పత్రికి చేరుకున్నారు. అక్కడ శ్రీనివాస్ రావు పార్థివదేహానికి పూలమాల వేసి అశ్రునయనాలతో నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, ధైర్యం చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -