కేంద్ర మంత్రి బండి సంజయ్
తిరిగి లేఖ పంపిన రాష్ట్ర మంత్రి తుమ్మల
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కనీస రాజకీయ పరిజ్ఞాన లేకుండా రైతుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వంపై బురద చల్లడం కేంద్ర మంత్రిగా బండి సంజరుకు తగదని రాష్ట్ర వ్యవసా య శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హితవు పలికారు. కేంద్ర ప్రభుత్వంగా రైతులకు ఇచ్చిన హామీలేంటి? కేంద్రం నెరవేర్చిందేంటి? అమలు చేయనివేంటి? అనే విషయాలను చెప్పాలని ప్రశ్నించారు. బండి సంజరు రాసిన లేఖకు తుమ్మల నాగేశ్వరరావు తిరిగి సమాధానమిచ్చారు. ఎమ్‌ఎస్‌ప ీకి చట్టబద్ధత కల్పించాలని బండి లేఖ రాయడం విడ్డూరంగా ఉందన్నారు. కేంద్ర మంత్రిగా ఉండి ఎమ్‌ఎస్‌పీ చట్టబద్ధత ఎవరు చేస్తారనే కనీస అవగా హన లేకపోవడమేంటని ప్రశ్నించారు. చట్టబద్ధత కల్పించాల్సిందే కేంద్రమే కదా? అని నిలదీశారు. 2014 వరకు కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధరలను ప్రకటించడమే కాకుండా ఎఫ్‌సీఐ, సీసీఐ, నాఫెడ్ లాంటి సంస్థల ద్వారా పంటలను కొనుగోలు చేసేదని గుర్తుచేశారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చాక ఆ బాధ్యత నుంచి తప్పుకున్నది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు.
తెలంగాణలో రైతులకు రూ.20,625 కోట్ల రుణమాఫీ చేసిన విషయం కనిపించడం లేదా? అని నిలదీశారు. బీజేపీ పాలిత చాలా రాష్ట్రాల్లో కూడా రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారనీ, ఎన్ని రాష్ట్రాల్లో చేశారో ప్రకటించాలని డిమాండ్ చేశారు. పంట నష్టపోయిన రైతులకు మేలు చేసేందుకు 2014 వరకు కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫ్ ఇండియా ద్వారా పంటల బీమా పథకం అమలు చేసేవారని గుర్తుచేశారు. మోడీ సర్కారు దాన్ని నిర్వీర్యం చేసి ప్రయివేటు ఇన్సూరెన్స్ కంపెనీలకు ప్రీమియం రూపంలో దోచిపెట్టేందుకు ప్రధాని ఫసల్‌బీమా యోజన పథకం తెచ్చింది వాస్తవం కాదా? ఆ పథకం మంచిదైతే గుజరాత్, తదితర బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా ఆ పథకం ఎందుకు తప్పుకున్నాయి? అని ప్రశ్నించారు. పంట నష్టం కింద కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రెండు పర్యాయాలలో రూ.250 కోట్ల వరకు చెల్లించామనీ, ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లో ఎంత జమచేసిందో బండి సంజరు చెబితే బాగుండేదని పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వం పంటల కొనుగోళ్ల విషయంలో షరతులు విధించినా, కొన్ని పంటలను అసలే కొనబోమని తేల్చిచెప్పినా… రాష్ట్ర ప్రభుత్వం భారం భరించి రైతుల నుంచి సోయాబీన్, జొన్న, మొక్కజొన్న, ధాన్యం కొనుగోలు చేసిన విషయం కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో వరి, పత్తి కొనుగోళ్లకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చుచే సింది రూ.4 వేల కోట్లు కాగా కేంద్రం వెచ్చించింది రూ.1000 కోట్లు మాత్రమేనని స్పష్టం చేశారు. ఎకరాలో వచ్చే దిగుబడిలో 25 శాతం మాత్రమే కొనుగోలు చేస్తామని షరతులు విధించి ప్రతి గింజా కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నదని బండి మాట్లాడటం విడ్డూరంగా ఉందని పేర్కొన్నా రు. ఏ బీజేపీ పాలిత రాష్ట్రమైనా కేంద్రం పరిమితుల ను మించి పంటలను కొనుగోలు చేస్తున్నాయా? అని ప్రశ్నించారు. ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, ఒడిశాలలో వరి, మొక్కజొన్న పంటలను రైతులు 40 నుంచి 50 శాతం నష్టం మేరకు అమ్ముకుంటున్నది వాస్తవం కాదా? అని నిలదీశారు. కొనుగోళ్ల పరిమితులను ఎత్తేయాలని కేంద్రానికి ఎన్నిమార్లు లేఖలు రాసినా పట్టించుకోవడం లేదని విమర్శించారు. కేంద్రం సహకరించినా, సహకరి ంచకపోయినా తమది రైతు సంక్షేమ ప్రభుత్వమనీ, రైతుల కోసం ఎంతైనా ఖర్చుపెడతామని స్పష్టం చేశారు. రాజకీయ లబ్ది కోసం లేఖలు వదిలి బురద జల్లే ప్రక్రియను మానుకోవాలని బండికి హితవు పలికారు.
బండీ..మీరు రైతులకు చేసిందేందీ?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



