- Advertisement -
నవతెలంగాణ- గట్టు
వేడి వేడి సాంబార్లో పడి బాలిక మృతి చెందిన ఘటన జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండల పరిధిలోని వాయుకుంట తండాలో శనివారం చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం గట్టు మండల పరిధిలోని వాయుకుంట తండాలో శంకర్ నాయక్ నివాసం ఉంటున్నారు. వారం రోజుల క్రితం ఇంటి పక్కన పెళ్లి సంబంధం ఉండడంతో శంకర్‌నాయక్ కుటుంబ సభ్యులు అక్కడికి వెళ్లారు. తల్లితోపాటు ఆమె కూతురు 18నెలల అను కూడా నడుచుకుంటూ వెళ్లింది. నడుస్తున్న క్రమంలో అదుపు తప్పి అక్కడే ఉన్న సాంబార్ కుండిలో చిన్నారి పడింది. దీంతో వెంటనే చిన్నారిని చికిత్స కొరకు కర్నూలు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున మృతి చెందినట్టు గ్రామస్తులు తెలిపారు.
- Advertisement -


