Sunday, May 3, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంధాన్యం కొనుగోలులో నిర్లక్ష్యం సరికాదు

ధాన్యం కొనుగోలులో నిర్లక్ష్యం సరికాదు

- Advertisement -

వెంటనే కొనుగోళ్లు చేపట్టాలి : రైతుల డిమాండ్‌
మోపాల్‌, ఆర్మూర్‌, తల్లాడల్లో నిరసన
నవతెలంగాణ-మోపాల్‌/ఆర్మూర్‌/తల్లాడ

ధాన్యం కొనుగోలులో నిర్లక్ష్యం సరికాదని.. వెంటనే కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్‌ చేశారు. శనివారం మండల కేంద్రంలో దొడ్డు రకం ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేస్తూ రాస్తారోకో చేపట్టారు. అనంతరం రోడ్డుపైనే మానవహారం చేపట్టి నిరసన తెలియజేశారు. అలాగే ఆర్మూర్‌ పట్టణంలోని మున్సిపల్‌ పరిధిలోని పెర్కిట్‌ 44వ జాతీయ రహదారి శివాలయం సమీపంలో రైతులు రాస్తారోకో చేపట్టారు. దీంతో కొద్దిసేపు రహదారిపై ఉద్రిక్తత నెలకొంది. రాస్తారోకో నిర్వహిస్తున్న స్థలానికి స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌ సత్యనారాయణగౌడ్‌ విచ్చేసి రైతులతో మాట్లాడారు. అధికారులతో చర్చించి సమస్యను పరిష్కరించుకోవాలని సూచించడంతో రాస్తారోకోను విరమింపచేశారు.

తల్లాడలో..
వరి ధాన్యం, మొక్కజొన్న పంట కొనుగోలు చేయాలని తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా తల్లాడ తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట శనివారం ధర్నా నిర్వహించారు. కార్యాలయం ముందు బైటాయించి ధాన్యం వెంటనే కొనాలని నినాదాలు చేశారు.


- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -