- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ నూతన డీజీపీగా బాధ్యతలు చేపట్టిన సీవీ ఆనంద్ తన తల్లిని ఉద్దేశించి భావోద్వేగభరిత వ్యాఖ్యలు చేశారు. తన తల్లి గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడ్డారని, ఆ సమయంలో ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉండేదని గుర్తుచేసుకున్నారు. “ప్రస్తుతం అమ్మ ఆరోగ్యం మెరుగైంది, కానీ ఇంకా మంచానికే పరిమితమయ్యారు. తన కొడుకును ఈ రాష్ట్రానికి డీజీపీగా చూడాలన్న ఆమె బలమైన కోరికే, అనారోగ్యం నుంచి ఆమెను బయటపడేసిందని నేను బలంగా నమ్ముతున్నాను” అని సీవీ ఆనంద్ పేర్కొన్నారు. డీజీపీగా తన నియామకం గురించి తెలిసి తన తల్లి ఎంతో ఆనందపడ్డారని, ఆమె సంతోషం చూసి తానూ ఉప్పొంగిపోయానని చెప్పారు.
- Advertisement -



