Sunday, May 3, 2026
E-PAPER
Homeతాజా వార్తలురేపటి నుంచి రైతు వారోత్సవాలు: మంత్రి తుమ్మల

రేపటి నుంచి రైతు వారోత్సవాలు: మంత్రి తుమ్మల

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా రేపటి నుండి 9 వరకు రైతు వారోత్సవాలు ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహించనున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొంటూ వారోత్సవాలు రైతుల ఇంటి వద్దకే చేరే కార్యక్రమంగా రూపొందించామని, రాబోయే వ్యవసాయ సీజన్‌కు రైతుల్లో నమ్మకం పెంపొందించేందుకు దోహదపడుతుందని ఆయన వివరించారు. శాఖల మధ్య సమన్వయం సక్రమంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, జిల్లా కలెక్టర్లు నోడల్ అధికారులుగా వ్యవహరిస్తూ కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.

ప్రతి రోజును ఒక ప్రత్యేక శాఖకు కేటాయించి కార్యక్రమాలు నిర్వహిస్తామని, మొదటి రోజు మట్టి ఆరోగ్యం, సమతుల ఎరువుల వినియోగం, సహజ వ్యవసాయం వంటి అంశాలపై అవగాహన కల్పించనున్నట్లు చెప్పారు. రెండో రోజు ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో పంటల విభిన్నీకరణ, మైక్రో ఇరిగేషన్ వంటి అంశాలపై కార్యక్రమాలు జరుగుతాయని, మూడో రోజు సహకార, మార్కెటింగ్ శాఖల ద్వారా మార్కెట్ లింకేజులు, రుణ సదుపాయాలపై వివరాలు అందిస్తామని పేర్కొన్నారు. నాలుగో రోజు యాంత్రీకరణ, డ్రోన్ల వినియోగం, సౌర శక్తి పరిష్కారాలపై ప్రదర్శనలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఐదో రోజు పశుసంవర్థక, మత్స్య శాఖలు పశు ఆరోగ్యం, చేపల ఉత్పత్తి పెంపుపై అవగాహన కల్పిస్తాయని, చివరి రోజు సాగునీటి శాఖ వర్షాకాలానికి ముందస్తు చర్యలు, నీటి వనరుల నిర్వహణపై మార్గనిర్దేశనం చేస్తుందని వివరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -